మరో కత్తిగాటు నాకొద్దు | Kangana Ranaut injured on 'Manikarnika' sets; gets 15 stitches on face | Sakshi
Sakshi News home page

మరో కత్తిగాటు నాకొద్దు

Oct 3 2017 12:54 AM | Updated on Aug 21 2019 10:25 AM

Kangana Ranaut injured on 'Manikarnika' sets; gets 15 stitches on face - Sakshi

టమేటో సాసో? రెడ్‌ కలర్‌ నీళ్లో? కాదు... అంతా రక్తమే! కంగనా రనౌత్‌ ముఖమంతా రక్తమే! ఏమైందో యూనిట్‌కి తెలిసేలోపే... క్షణాల్లో కంగనా ముఖంపై గంగానదిలా రక్తం పారింది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సుమారు పదికుట్లు వేశారు డాక్టర్లు. అసలు మేటర్‌ ఏంటంటే... వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథతో క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మణికర్ణిక’లో లక్ష్మీభాయ్‌ పాత్రలో కంగనా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సిన్మా కోసం కత్తి యుద్ధం సన్నివేశాలు తీస్తున్నప్పుడు కంగనా నుదుటిపై గాయమైంది. అలా కంగనాకు ఈ సినిమా ఓ కత్తిగాటును గుర్తుగా మిగిల్చింది. ప్లాస్టిక్‌ సర్జరీతో ఆ గాటును మాయం చేయాలను కోవడంలేదామె. ఎందుకంటే... ‘ప్లాస్టిక్‌ సర్జరీ పేరుతో మరోచోట గాటు పెడతారు కదా. అది నాకొద్దు’ అని కంగనా చెప్పారు. సిన్మాల్లో మేకప్‌తో కత్తిగాటును కవర్‌ చేస్తారట. మామూలు సమయాల్లో గాటుతోనే తిరుగుతారట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement