ప్రముఖ నటుడి వీలునామా? | kamal hassan testament | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడి వీలునామా?

May 19 2017 8:30 AM | Updated on Sep 5 2017 11:31 AM

ప్రముఖ నటుడి వీలునామా?

ప్రముఖ నటుడి వీలునామా?

విలక్షణ నటుడు కమలహాసన్‌ తన ఆస్తులను తన కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లకు చెందేలా వీలునామా రాసి ఇచ్చిన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.

తమిళసినిమా(చెన్నై): విలక్షణ నటుడు కమలహాసన్‌ తన ఆస్తులను తన కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లకు చెందేలా వీలునామా రాసి ఇచ్చిన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కమలహాసన్‌ నటుడిగా, నిర్మాతగా పలు చిత్రాలు చేసినా.. సంపాదించిన డబ్బును పెద్దగా కూడబెట్టుకోలేదనే ప్రచారం ఉంది.

ఆయనకు డబ్బు వెనకేసుకోవడం తెలియదని నటుడు రజనీకాంత్‌ ఇటీవల బహిరంగంగానే వాఖ్యానించారు. కమల్‌ తన ఆస్తులను శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లకు సరి సమానంగా వీలునామా రాసినట్లు ప్రచారం సాగుతోంది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా కమల్‌ వీలునామా రాశారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనిపై ఆయన ఏం చెబుతారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement