85 ఏళ్ల కాజల్‌!

Kamal Hasan is Indian 2 team heads to Bhopal - Sakshi

‘ఇండియన్‌ 2’ సినిమాలో మార్షల్‌ ఆర్ట్స్‌ చేయడానికి కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాకముందు ఆమె మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమాలో వృద్ధ కమల్‌హాసన్‌ (సేనాపతి)కి జోడీగా నటిస్తున్నారట కాజల్‌. అది కూడా 85 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబోతున్నారని టాక్‌. మరి.. వృద్ధురాలి పాత్ర అంటే మార్షల్‌ ఆర్ట్స్‌ సాధ్యపడదు. ఒకవేళ యంగ్‌ క్యారెక్టర్‌లో కనిపించే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంటుందేమోననే ఊహాగానాలు ఉన్నాయి. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్‌2’.

1996లో వచ్చిన ‘ఇండియన్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ 90ఏళ్ల వృద్ధుడి పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోంది. ఓ పొలిటికల్‌ ర్యాలీ, లోకల్‌ మార్కెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను తెరకెక్కించారు. ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కూడా ఈ షెడ్యూల్‌లోనే ప్లాన్‌ చేశారు. భోపాల్‌ షెడ్యూల్‌ తర్వాత గ్వాలియర్‌లో కీలక సన్నివేశాలు తీస్తారు. ఆ తర్వాత తైవాన్‌లో చిత్రీకరణ జరపాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందట. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్‌ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top