నాలుగు సినిమాలతో నందమూరి హీరో.! | Kalyan Ram Will be Having Four Releases in 2019 | Sakshi
Sakshi News home page

Jan 27 2019 2:12 PM | Updated on Jan 27 2019 2:38 PM

Kalyan Ram Will be Having Four Releases in 2019 - Sakshi

నందమూరి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ ఇమేజ్‌ కోసం కష్టపడుతున్న యంగ్ హీరో కల్యాణ్ రామ్‌. కెరీర్‌లో అతనొక్కడే, పటాస్‌ లాంటి హిట్స్‌ ఉన్నా కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా మాత్రం ఇంతవరకు పడలేదు. అయితే సక్సెస్‌ విషయం పక్కన పెడితే ఈ యంగ్ హీరో ఈ ఏడాది ఓ ఇంట్రస్టింగ్ ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ జనరేషన్‌ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే కల్యాన్‌ రామ్‌ ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో అలరిస్తున్నాడు.

కల్యాణ్ రామ్‌ గెస్ట్ అపియరెన్స్‌ ఇచ్చిన యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సీక్వల్‌గా రూపొందుతున్న యన్‌.టి.ఆర్‌ మహానాయకుడులో కల్యాణ్‌ రామ్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుంది. ఇక కేవీ గుహన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 118 కూడా మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇటీవల ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో కల్యాణ్ రామ్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు నందమూరి హీరో.

Advertisement
 
Advertisement
Advertisement