కళ్యాణ్ రామ్తో క్రిష్..? | Kalyan ram Movie with Krish | Sakshi
Sakshi News home page

కళ్యాణ్ రామ్తో క్రిష్..?

Mar 12 2017 10:46 AM | Updated on Sep 5 2017 5:54 AM

కళ్యాణ్ రామ్తో క్రిష్..?

కళ్యాణ్ రామ్తో క్రిష్..?

నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ కోసం ఇప్పటికీ పోరాడుతున్న యంగ్ హీరో కళ్యాణ్ రామ్

నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ కోసం ఇప్పటికీ పోరాడుతున్న యంగ్ హీరో కళ్యాణ్ రామ్. ఇటీవల పటాస్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన కళ్యాణ్ రామ్, తరువాత షేర్, ఇజం సినిమాలతో మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం నిర్మాతగా ఎన్టీఆర్, బాబీల కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్న ఈ యంగ్ హీరో, తాను హీరోగా చేయబోయే సినిమా కోసం మంచి టీం సెట్ చేసే పనిలో ఉన్నాడు.

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు క్రిష్, ఈ మధ్య కళ్యాణ్ రామ్కు ఓ కథ చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. బాబాయ్తో భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు తనతో సినిమాకు రెడీ అయ్యే సరికి కళ్యాణ్ రామ్ తెగ సంబరపడిపోతున్నాడు. కానీ క్రిష్ చెప్పిన కథ తనే స్యయంగా డైరెక్ట్ చేస్తాడా..? లేక తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వారెవరైనా డైరెక్ట్ చేస్తారా అన్న విషయంలో క్లారిటీలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement