‘కాజల్‌’తో పోజులిచ్చిన ‘చందమామ’! | Kajal Aggarwal Unveils Her Wax Statue Madame Tussauds Museum Singapore | Sakshi
Sakshi News home page

తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన కాజల్‌

Feb 5 2020 11:00 AM | Updated on Feb 5 2020 11:34 AM

Kajal Aggarwal Unveils Her Wax Statue Madame Tussauds Museum Singapore - Sakshi

దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందిన హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తన మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. కుటుంబంతో కలిసి సింగపూర్‌కు చేరుకున్న ఈ చందమామ.. అక్కడి మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన తన విగ్రహంతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌​ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో తమ అభిమాన హీరోయిన్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కాజల్‌ ఫ్యాన్స్‌ నెట్టింట సందడి చేస్తున్నారు.

కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖల విగ్రహాలు సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన సంగతి తెలిసిందే. దివంగత తార శ్రీదేవి, అనుష్క శర్మ, కరణ్‌ జోహార్‌ సహా టాలీవుడ్‌ హీరోలు ప్రభాస్‌, మహేష్‌ బాబు విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ రూపొందించింది. ఇక దక్షిణాది నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి హీరోయిన్‌గా కాజల్‌ రికార్డుకెక్కారు.

ఇక లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్‌.. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 12 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె... తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాతో పాటు, లోకనాయకుడు కమల్ హాసన్- స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement