కొత్త దశాబ్దానికి శుభారంభం | Kajal Agarwal First Tollywood Actress To Get A Wax Statue At Madame Tussaud Singapore | Sakshi
Sakshi News home page

కొత్త దశాబ్దానికి శుభారంభం

Dec 18 2019 12:08 AM | Updated on Dec 18 2019 2:16 AM

Kajal Agarwal First Tollywood Actress To Get A Wax Statue At Madame Tussaud Singapore - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

పాత సంవత్సరానికి గుడ్‌ బై చెప్పేటప్పుడు కొత్త ఏడాది అంతా బాగుండాలని కోరుకుంటాం. కాజల్‌ అగర్వాల్‌ అలానే కోరుకుంటున్నారు. అయితే రానున్న  2020 గురించి మాత్రమే కాదు.. వచ్చే దశాబ్దం కూడా తనకు బాగుంటుందని ఆమె అంటున్నారు. దానికి కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖుల లిస్ట్‌లో కాజల్‌ చేరబోతున్నారు. మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో ఎంతోమంది సెలబ్రిటీల బొమ్మల సరసన కాజల్‌ మైనపు బొమ్మ చేరబోతోంది. సింగపూర్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న తన మైనపు బొమ్మను కాజల్‌ ఆవిష్కరించనున్నారు.

‘‘నా చిన్నప్పుడు తుస్సాడ్స్‌ మ్యూజియమ్‌కి వెళ్లి, అక్కడున్న ప్రముఖుల బొమ్మలను ఎంతో ఆరాధనగా చూసేదాన్ని. నా బొమ్మ వారితో పాటు ఉండబోవటం అనేది నాకు దక్కిన గౌరవంలా భావిస్తున్నాను. కొత్త దశాబ్దం శుభారంభానికి ఇది నాంది అనుకుంటున్నాను. నిద్ర లేకుండా ఎంతో కష్టపడి షూటింగ్‌ చేసిన రాత్రులు, ఎన్నో వ్యక్తిగత త్యాగాలకు దక్కిన ప్రతిఫలంలా భావిస్తున్నా. నా బొమ్మను నా చేతులతో  ఆవిష్కరించే రోజు కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు కాజల్‌ అగర్వాల్‌. కాజల్‌ బొమ్మకు కావాల్సిన కొలతలను తుస్సాడ్స్‌ టీమ్‌ తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement