పంజాబీ చిత్రంలో లక్కు ఎలా ఉంటుందో! | Kajal Agarwal debut in Punjabi film | Sakshi
Sakshi News home page

పంజాబీ అమ్మాయిగా కాజల్‌

Jun 11 2018 9:11 AM | Updated on Oct 30 2018 6:01 PM

Kajal Agarwal debut in Punjabi film - Sakshi

తమిళసినిమా: అందాల నటి కాజల్‌అగర్వాల్‌ ఇప్పుడు పంజాబీగా మారనుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ఏమిటీ అర్ధం కాలేదా? కాజల్‌ ఏమిటీ పంజాబీ అమ్మయిగా మరడం ఏమిటీ? పంజాబీ అబ్బాయిని ప్రేమించిందా? అనే సందేహాలు మీకు కలగడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాజల్‌కు ప్రేమ, పెళ్లి విషయాల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులు కూడా కాజల్‌కు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారు. తన తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా సిద్ధం, వారు చెబితే నటనను కూడా మానేస్తాను అని కాజల్‌ ఇటీవల బహిరంగంగానే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తన చెల్లెలు నిషా అగర్వాల్‌ పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కనేసింది. కాబట్టి కాజల్‌ అగర్వాల్‌ పెళ్లికి సిద్ధం అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పాలి. తమిళంలో ప్యారీస్‌ ప్యారీస్‌ అనే ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. ఇక తెలుగులో ఒకటి రెండు అవకాశాలు చేతిలో ఉన్యాయి. కాబట్టి కాజల్‌అగర్వాల్‌ పెళ్లి ఆలోచనలో ఉన్న మాట నిజమే అయినా, మీరు ఊహించుకుంటున్నట్లు ఆమెకింకా పెళ్లి గడియలు రాలేదు. ఇంతకీ పంజాబీ అమ్మాయి గొడవేంటనేగా మీ ప్రశ్న. ఇప్పటి వరకూ తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ స్టార్స్‌ అందరితోనూ నటించిన కాజల్‌ హిందిలో ఒకటి రెండు చిత్రాలు చేసినా బాలీవుడ్‌ పెద్దగా పట్టించుకోలేదు. ముంబాయికి చెందిన ఈ అమ్మడు ఇప్పుడు కొత్తగా పంజాబీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోందట. ఈ విషయాన్ని కాజల్‌అగర్వాల్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని కాజల్‌ పేర్కొంది. మొత్తం మీద ఈ 33 ఏళ్ల బ్యూటీ నాలుగో లాంగ్వేజ్‌లోకి కాలిడుతోందన్న మాట. నటులకు భాషా భేదం లేదంటారు. చూద్దాం మరి పంజాబీ చిత్ర పరిశ్రమలో కాజల్‌ లక్కు ఎలా ఉంటుందో!

Advertisement
 
Advertisement
Advertisement