అరవింద సమేత : రెడ్డెమ్మ తల్లి కవర్‌ సాంగ్‌ | Jr Ntr Aravindha Sametha Reddamma Thalli Cover Song | Sakshi
Sakshi News home page

Oct 16 2018 9:34 AM | Updated on Oct 16 2018 9:40 AM

Jr Ntr Aravindha Sametha Reddamma Thalli Cover Song - Sakshi

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఇటీవల విడుదలైన ఈ సినిమా తొలి వారాంతానికే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. పండుగ సీజన్‌ కావటంతో ముందు ముందు కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అందుకే చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే సక్సెస్‌మీట్‌ను నిర్వహించిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన అరవింద సమేత టీం. తాజాగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే రెడ్డమ్మ తల్లి పాట కవర్‌ వర్షన్‌ను రిలీజ్‌ చేసింది. ఈ పాటను ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్‌ దాస్‌ స్వయంగా రాసి పాడారు.

Advertisement
 
Advertisement
Advertisement