ఆగస్ట్‌ 15న బాక్సాఫీస్‌పై ‘ఎటాక్‌’

John Abraham Is Set To Attack Box Office - Sakshi

ముంబై : వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్‌ 15న తన తాజా చిత్రం ఎటాక్‌ విడుదలవుతుందని ఆ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం వెల్లడించారు. ఈ పోస్టర్‌లో గన్‌ చేతపట్టి తీక్షణంగా చూస్తున్న జాన్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో జాన్‌ అబ్రహం సరసన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఆడిపాడనున్నారు. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ నిర్ధేశకత్వంలో రూపొందే ఎటాక్‌ మూవీ పెన్‌ స్టూడియోస్‌, జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, అజయ్‌ కపూర్‌లు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోంది. జాన్‌ అబ్రహం గత  చిత్రాలు సత్యమేవజయతే, బాట్లాహౌస్‌ కూడా ఆగస్ట్‌ 15న విడుదలైన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top