పోలీస్‌ పటాస్‌ @ 97 | Jana Gana Mana first look release | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పటాస్‌ @ 97

Jun 3 2019 1:22 AM | Updated on Jun 3 2019 1:22 AM

Jana Gana Mana first look release - Sakshi

అయేషా హబీబ్, రవికాలే, కురిరంగా ముఖ్య పాత్రల్లో శశికాంత్‌ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన చిత్రం ‘జనగణమన’. ఈ సినిమాని భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘పోలీస్‌ పటాస్‌’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ కమిట్‌మెంట్‌ ఉన్న నిర్మాత అని విన్నాను. ‘పోలీస్‌ పటాస్‌’ ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌ చూశాక సినిమాలపట్ల ఆయనకు ఉన్న అభిరుచి తెలిసింది. అందుకే ఆయన 97సినిమాలు తీశారు. ఈ ఏడాదిలోనే 100 సినిమా కూడా నిర్మించాలి’’ అన్నారు. ‘‘నిర్మాతగా ‘పోలీస్‌ పటాస్‌’ నాకు 97వ సినిమా. ఈ సినిమా కన్నడలో విజయం అందుకుంది.  అయేషా తిరుపతి అమ్మాయే.  తను త్వరలోనే ఓ స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నా. ఈ నెలలో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ. 

Advertisement
 
Advertisement
Advertisement