బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి | Ismart Shankar Team In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

Aug 4 2019 4:21 PM | Updated on Aug 5 2019 9:27 AM

Ismart Shankar Team In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో వీకెండ్‌ వచ్చిందంటే సందడి నెలకొంటుంది. ఇంటి సభ్యులకు ఆ రెండు రోజులు కొత్త మొహం కనపడుతుంది. హోస్ట్‌ రూపంలో నాగార్జున వచ్చి సందడి చేస్తాడు. వారు చేసిన తప్పులను సరిచేస్తాడు. ఇక హౌస్‌లో అప్పుడప్పుడు కొత్త అతిథులు కూడా వస్తారు. అలా ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో ఇస్మార్ట్‌ శంకర్‌ సందడి చేయనున్నాడు. రామ్‌, నిధి అగర్వాల్‌ ఇద్దరూ నేటి ఎపిసోడ్‌లో నాగ్‌తో పాటు హల్‌చల్‌ చేయనున్నట్లు తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది.

ఇక ఆదివారం వస్తే బిగ్‌బాస్‌ ఇంటిసభ్యుల్లోంచి ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సి వస్తుంది.. ఇక ఎలిమినేషన్‌ విషయమై లోపల ఉన్న వారికి గుండె దడ మొదలవుతుంది. అయితే బయట ఉన్న ప్రేక్షకులకు కూడా అంతే ఉత్కంఠ ఉన్నా కూడా ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో ముందో లీకవ్వడంతో సస్పెన్స్‌లో ఉన్న మజా పోతోంది. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో మరింత సందడి వాతావరణాన్ని తీసుకోచ్చేందుకు రామ్‌, నిధి వచ్చేశారు. వీరితో నాగ్‌, ఇంటి సభ్యులు కలిసి బాగానే ఎంజాయ్‌ చేసినట్టు కనిపిస్తోంది. ఇక నేడు జాఫర్‌ ఎలిమినేట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. మరి నిజంగానే జాఫర్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement