మృత్యువుతో పోరాడి ఓడిన ఇర్ఫాన్‌ ఖాన్‌

Irrfan Khan Is Still Fighting: Actors Spokesperson Refutes Death Rumours - Sakshi

ముంబై: తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ మృత్యువుతో పోరాడి శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. పెద్ద‌పేగు సంబంధిత వ్యాధికి ఆయ‌న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఇర్ఫాన్‌ మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.  ఆయన ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని, ఇర్ఫాన్‌ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన చివ‌రిగా  ‘అంగ్రేజీ మీడియం’ లో ముఖ్యపాత్రలో నటించారు. ప్రారంభంలో బుల్లితెరపై పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్‌ ‘సలామ్ బాంబే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ‘పాన్ సింగ్ తోమర్’  చిత్రానికి ఉత్తమ నటుడుగా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు.  (ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్‌)

కేవలం నా భార్య కోసమే..
కాగా ఇర్ఫాన్‌ఖాన్‌ త‌ల్లి సైదా బేగం శ‌నివారం మృతి చెందారు. అటు లాక్‌డౌన్‌తోపాటు ఇటు ఆయన ఆరోగ్యం కూడా బాగోలేక‌పోవ‌డంతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే త‌ల్లిని క‌డ‌సారి చూసుకున్నారు. విలక్షణ నటుడుగా పేరుగాంచిన ఇర్ఫాన్‌... బాలీవుడ్‌లో తనకంటు ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. గత రెండేళ్లుగా ఆయన క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. అనంతరం ముంబై వచ్చిన ఇర్ఫాన్‌... ‘జీవితం అనేది రోలర్‌ క్యాస్టర్‌ రైడ్‌ వంటిది. మధురమైన అనుభూతులతోపాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయి. సంతోషకరమైన క్షణాలను మాత్రమే గుర్తుంచుకోవాలి. మేము కొన్ని బాధలను అనుభవించాం.. అంతకంటే ఎక్కువ ఆనందంగా గడిపాం. నేను విపరీతమైన ఆందోళనకు గురయ్యాను.. కానీ దానిని ప్రస్తుతం నియంత్రించగలిగాను. నా కొడుకులతో గొప్ప సమయం గడిపాను. నేను జీవించాలి అనుకుంటే కేవలం నా భార్య కోసం జీవించాలనుకుంటున్నాను. నేను ఇంకా బతికి ఉండటానికి ఆమె కారణం’ అంటూ తెలిపారు.  (వీడియో కాన్ఫ‌రెన్స్‌లో త‌ల్లికి నివాళుల‌ర్పించిన న‌టుడు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top