బాలీవుడ్‌ న‌టుడి త‌ల్లి క‌న్నుమూత | Actor Irrfan Khan Mother Saeeda Begum Passes Away | Sakshi
Sakshi News home page

వీడియో కాన్ఫ‌రెన్స్‌లో త‌ల్లికి నివాళుల‌ర్పించిన న‌టుడు

Apr 26 2020 10:00 AM | Updated on Apr 26 2020 10:10 AM

Actor Irrfan Khan Mother Saeeda Begum Passes Away - Sakshi

బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్‌ త‌ల్లి సైదా బేగం(95) శ‌నివారం ఉద‌యం మృతి చెందారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె త‌న స్వగృహంలో తుది శ్వాస విడిచారు. కాగా న‌వాబుల కుటుంబానికి చెందిన ఆమె జైపూర్‌లోని బెనివ‌ల్‌కంత కృష్ణ కాల‌నీలో నివ‌సిస్తున్నారు. మ‌రోవైపు ఇర్ఫాన్ ఖాన్ ప్ర‌స్తుతం ముంబైలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా అత‌ను త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్ల‌లేక‌పోయాడు. దీంతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా త‌ల్లిని క‌డ‌సారి క‌ళ్లారా చూసుకొని నివాళులు అర్పించాడు. (వీల్‌చైర్‌లో నటుడు.. ముఖం దాచుకొని..!)

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ బాలీవుడ్ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా వుండ‌గా రెండు సంవ‌త్స‌రాలుగా క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతున్న ఇర్ఫాన్ ఈ మ‌ధ్యే కోలుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇక‌ ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన‌ "ఆంగ్రేజీ మీడియం" ఇటీవ‌లే విడుద‌లై మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇందులో కరీనా కపూర్‌, రాధినా మదన్‌, డింపుల్‌ కపాడియా, కికూ శారద, రణ్‌వీర్‌ షోరే తదితరులు కీలక పాత్రల్లో న‌టించారు. (క్యాన్సర్‌ కదా.. అందుకే: ఇర్ఫాన్‌ ఖాన్‌ భావోద్వేగం!)

Advertisement
 
Advertisement
Advertisement