ఇర్ఫాన్‌ ఖాన్‌కు ఏమైంది?

Irrfan Khan hides his face when spotted at Mumbai Airport - Sakshi

బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ గతకొంతకాలంగా లండన్‌లో ఉంటూ.. క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ముంబై విమానాశ్రయంలో అకస్మాత్తుగా ఆయన కనిపించడంతో అభిమానులు, ఫొటోగ్రాఫర్లు ఆనందానికి లోనయ్యారు. కానీ, ఇంతలోనే ఇర్ఫాన్‌ తన ముఖం కనిపించకుండా చొక్కాతో కవర్‌ చేసుకున్నారు. కనీసం ఫొటోలకు పోజు ఇవ్వలేదు. పైగా వీల్‌చైర్‌పై ఆయన ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వెళ్లారు. ముఖాన్ని దాచుకొనే ఆయన తన కారులో ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయన ఇలా ఎందుకు వెళ్లిపోయారు కారణాలు తెలియరాలేదు.

గత ఏడాది మార్చిలో తాను అనారోగ్యానికి గురైనట్టు.. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఇర్ఫాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ముఖం దాచుకొని వెళ్లడం ఆరోగ్యపరంగా ఆయన పరిస్థితి బాగాలేదనే సంకేతాలను ఇస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top