అభిమానులనుద్దేశిస్తూ ట్వీట్‌ చేసిన ఇర్ఫాన్‌

Irrfan Khan Announces Your love Soothed Me In Healing - Sakshi

గత కొంతకాలంగా ఎండోక్రైన్‌ క్యాన్సర్‌ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఇర్ఫాన్‌ చేసిన ట్వీట్‌ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ‘గెలుపు ముసుగులో ఒక్కోసారి ప్రేమించబడటం అనే విషయం మనకు పెద్దదిగా తోచదు.. దాన్ని పట్టించుకోం..మర్చిపోతుంటాం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ విషయం గుర్తుకు వస్తుంది. అందుకే నేను వెనక్కి రావాలనుకుంటున్నాను. మీ అపారమైన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలపడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా అనారోగ్యాన్ని నయం చేసుకునే క్రమంలో మీ ప్రేమ, మద్దతు నాకు ఉపశమనాన్ని కల్గించాయి. మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపడానికి మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను’ అంటూ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశారు ఇర్ఫాన్‌.

ఇర్ఫాన్‌ ఖాన్‌ నిన్ననే ఇండియా వచ్చారు. త్వరలోనే ఆయన ‘హిందీ మీడియం’ సీక్వేల్‌లో నటిస్తారని సమాచారం. ఎండోక్రైన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్‌ ఖాన్‌ చికిత్స నిమిత్తం లండన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. (చదవండి : నా స్టేషన్‌ ఇది కాదే!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top