అఖిల్ సినిమాలో ఇలియానా? | Ileana likely to do a item number in akhil movie | Sakshi
Sakshi News home page

అఖిల్ సినిమాలో ఇలియానా?

May 11 2015 8:03 AM | Updated on Sep 3 2017 1:51 AM

అఖిల్ సినిమాలో ఇలియానా?

అఖిల్ సినిమాలో ఇలియానా?

అక్కినేని వారసుడు అఖిల్ తెరంగేట్రం చేయనున్న కొత్త సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కనిపించనుంది. గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో కనిపించని ఇలియానా... ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించిందట!

అక్కినేని వారసుడు అఖిల్ తెరంగేట్రం చేయనున్న కొత్త సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ కనిపించనుంది. గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో కనిపించని ఇలియానా... ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించిందట! ఈ విషయం టాలీవుడ్లో గుప్పుమంటోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ మొదటి సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఇలియానా ఐటెం సాంగ్ చేస్తోందని సమాచారం. గతంలో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్కు వెళ్లిన ఇలియానా.. ఆ తర్వాత మళ్లీ ఈమధ్య కాలంలో తెలుగులో కనిపించలేదు.

టాలీవుడ్లో అవకాశం వస్తే చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న ఇల్లీ.. ఎట్టకేలకు ఇలా అఖిల్ సినిమాలో అనుకోని అవకాశం రావడంతో వెంటనే మరో మాట మాట్లాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. సో.. చాలా కాలం తర్వాత అది కూడా 'స్పెషల్'గా ఇలియానాను తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారన్న మాట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement