మొదటి మెట్టుమీదే ఉన్నా | I`m too new to develop an attitude: Kriti Sanon | Sakshi
Sakshi News home page

మొదటి మెట్టుమీదే ఉన్నా

Jul 16 2014 10:41 PM | Updated on Apr 3 2019 6:23 PM

మొదటి మెట్టుమీదే ఉన్నా - Sakshi

మొదటి మెట్టుమీదే ఉన్నా

‘నేనింకా మొదటి మెట్టుమీదే ఉన్నా.. ఇప్పుడే శిఖరం అంచుపైన దృష్టిపెడితే కిందపడిపోయే ప్రమాదం ఉంది కదా.. అందుకే నిదానంగా పైకి వెళతా..’ అంటోంది బాలీవుడ్ నటి కృతిసనన్.

 ‘నేనింకా మొదటి మెట్టుమీదే ఉన్నా.. ఇప్పుడే శిఖరం అంచుపైన దృష్టిపెడితే కిందపడిపోయే ప్రమాదం ఉంది కదా.. అందుకే నిదానంగా పైకి వెళతా..’ అంటోంది బాలీవుడ్ నటి కృతిసనన్. తాను నటించిన హిందీ సినిమా ‘హీరోపంతి’ సూపర్‌హిట్ కావడంతో ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్‌ది బాలీవుడ్ గా మారిపోయింది. తాను ఇప్పటివరకు రెండు సినిమాలే చేశానని, ఒకటి బాలీవుడ్‌లో ‘హీరోపంతి’ కాగా, రెండోది తెలుగు సినిమా అని చెప్పింది. ’హీరోపంతి’ తామనుకున్న దానికన్నా పెద్ద హిట్ అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
 
 ‘దీంతోనే నేనేదో సాధించేశానని పొంగిపోలేను.. నేనింకా ఆరంభదశలోనే ఉన్నా.. సాధించాల్సింది చాలా ఉంది.ఇప్పుడే  నేను ఏదో సాధించేశానని అనుకుంటే ఇక్కడితో నా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసుకున్నట్లే..’ అని ఆమె స్పష్టం చేసింది. తన మీద అంచనాలనేవి ప్రజలు దృష్టిలో పెరగాలి తప్ప తనకు తానుగా పెంచుకోకూడదని తెలుసునంది. ‘ఇప్పుడిప్పుడే కెరీర్‌లో బిజీగా మారుతున్నా.. దానికనుగుణంగానే నా ఆలోచనాసరళి కూడా కొంచెం మార్చుకుంటున్నా. మొదటి అడుగులోనే విజయం సాధించినంతమాత్రాన తర్వాత అన్ని అంచనాలు ఒకేలా ఉంటాయనుకోవడం భ్రమే అవుతుంది.
 
 ‘మన హెయిర్‌స్టైల్ మార్చామనుకోండి.. మనలో భౌతికంగా కొంత మార్పు కనిపిస్తుంది కదా.. అంతమాత్రాన మనం మానసికంగా కూడా మారిపోయామనుకోవడం కరెక్ట్ కాదు..’ అని ఆమె స్పష్టం చేసింది. నేను ఈ సినిమా పరిశ్రమకు కొత్తదాన్ని. గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు.. అందుకే నేను వ్యక్తిగతంగా చాలామంది ప్రొడ్యూసర్లను కలిశా.. నా గురించి వివరించా.. అదృష్టవశాత్తు నా మొదటి నిర్మాత సాజిద్ నాదియావాలా నన్ను, టైగర్ షరాఫ్‌ను కన్నబిడ్డల్లా చూసుకున్నారు..’ అని చెప్పింది. సాజిద్‌తో మూడు సినిమాలకు చేసేందుకు కృతిసనన్ ఒప్పందం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement