'నా భార్యను ఆ క్యారెక్టర్లలో చూడాలనుంది' | I likes to watch Kareena in romantic roles, says Saif Ali Khan | Sakshi
Sakshi News home page

'నా భార్యను ఆ క్యారెక్టర్లలో చూడాలనుంది'

Sep 13 2015 5:57 PM | Updated on Apr 3 2019 6:23 PM

'నా భార్యను ఆ క్యారెక్టర్లలో చూడాలనుంది' - Sakshi

'నా భార్యను ఆ క్యారెక్టర్లలో చూడాలనుంది'

రొమాంటిక్ క్యారెక్టర్లలో తన భార్య కరీనాకపూర్ ఖాన్ ను చూడాలని ఉన్నట్లు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు.

ముంబయి : రొమాంటిక్ క్యారెక్టర్లలో తన భార్య కరీనాకపూర్ ఖాన్ ను చూడాలని ఉన్నట్లు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. మరిన్ని విషయాలను మీడియాతో సైఫ్ పంచుకున్నాడు. 2007లో విడుదలైన 'జబ్ వి మెట్' లో కరీనా పోషించిన పాత్ర తనకెంతో ఇష్టమని అన్నాడు.  తండ్రిని కావాలని తనకు అంతగా తొందర లేదని అన్నాడు. సంతానం కోసం తాము ఆరాటపడటం లేదని తెలిపాడు. తన భార్య, హీరోయిన్ కరీనాకపూర్ కోరుకున్నప్పుడే తమ దంపతులు సంతానం గురించి ఆలోచిస్తామని సైఫ్ చెప్పాడు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, చిన్న చిన్న బ్యానర్లలో నటించేందుకు కరీనా సిద్ధంగా ఉంటుందన్నాడు.

ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మరో రెండు, మూడేళ్ల వరకు తాను తల్లిని అవ్వడానికి ఇష్టపడటం లేదన్నట్లు కరీనాకపూర్ చెప్పింది. సైఫ్, అమృతా సింగ్ దంపతులకు సారా, ఇబ్రహీం అనే ఇద్దరు సంతానం అన్న విషయం అందరికీ విదితమే. అమృతతో విడాకులు తీసుకున్న తర్వాత కరీనాను 2012లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కరీనా కూడా సినిమాలతో బిజీగా ఉండటంతో సైఫ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివాహం తర్వాత కరీనా కెరీర్ చాలా గొప్పగా ఉందని చెప్పుకొచ్చాడు. అత్త బబితకు తాను నటించిన రొమాంటిక్, కామేడీ సినిమాలు 'కాక్టెయిల్', 'లవ్ ఆజ్ కల్' అంటే చాలా ఇష్టమంటూ సైఫ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తన పిల్లలు డిగ్రీ చేసిన తర్వాత వారికి నచ్చిన రంగాల్లోకి వారిని పంపిస్తానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement