నటన బోర్‌ కొట్టలేదు | I have no interest in the box office | Sakshi
Sakshi News home page

నటన బోర్‌ కొట్టలేదు

May 13 2019 3:25 AM | Updated on May 13 2019 3:25 AM

I have no interest in the box office - Sakshi

టబు

‘‘ఏదైనా ఓ పనిని ఏళ్ల తరబడి చేస్తూ ఉంటే బోర్‌ కొట్టే అవకాశం ఉంటుంది. అలాగే అలసిపోయే చాన్స్‌ కూడా ఉంది. కానీ యాక్టింగ్‌ నాకెప్పుడూ బోర్‌ కొట్టలేదు’’ అంటున్నారు టబు. 30ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారామె. యాక్టింగ్‌ ప్రాసెస్‌ గురించి, ఇంత లాంగ్‌ కెరీర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ– ‘‘యాక్టింగ్‌ అనేది ఫిజికల్‌ జాబ్‌తో పాటు మెంటల్‌ జాబ్‌ కూడా. ఇంతలాంగ్‌ కెరీర్‌లో కచ్చితంగా కొన్నిసార్లు అలసిపోతాం.

బోర్‌ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ ఏదైనా కొత్త కథ, విభిన్నమైన పాత్ర ఉంటే మాత్రం వెంటనే ఉత్సాహం వచ్చేస్తుంది. కథ, పాత్ర మాత్రమే నా కెరీర్‌కు మోటివేషన్‌. నా మైండ్‌ మోటివేటెడ్‌గా ఉన్నంత కాలం యాక్టింగ్‌ బోర్‌ కొట్టదు.. అలసిపోను కూడా’’ అన్నారు. హిందీలో టబు నటించిన ‘దే దే ప్యార్‌ దే’ రిలీజ్‌కు రెడీ అయింది. తెలుగులో అల్లు అర్జున్‌– త్రివిక్రమ్, వేణు ఊడుగుల–రానా సినిమాల్లో ఆమె కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement