ఆ షోలో నేను నటించట్లేదు: నటి

సోనీ టీవీలో ప్రసారమవుతున్న హిందీ సీరియల్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ లో లీడ్ క్యారక్టర్ ‘డయాబెన్’గా తాను నటించబోతున్నట్టు వచ్చిన వార్తలు వట్టి రూమరని నటి విభూతి శర్మ కొట్టిపారేసింది. ఆ సీరియల్‌ను తాను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదని స్పష్టం చేసింది. డయాబెన్ పాత్రను ఇంతకు ముందు నటి దిశా వకాని పోషించింది. ఆమె గత ఏడాదిన్నరగా మెటర్నిటీ లీవ్‌లో ఉంది. లీవ్ అయిపోయిన తర్వాత నిర్మాతకు ఆమె కొన్ని కండిషన్స్ పెట్టిందనీ, వాటికి నిర్మాత ఒప్పుకోకపోవడంతో ఆమె స్థానంలో విభూతి శర్మను తీసుకున్నట్టుగా ఒక వార్త మీడియాలో షికారు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. తనకు సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదని, ఒకవేళ నటించాల్సి వస్తే నా వయసు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటానని పేర్కొంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి