వార్‌ దూకుడు మామూలుగా లేదు..

Hrithik Roshan Tiger Shroffs War Become The Second Highest Grosser - Sakshi

ముంబై : బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌, యువసంచలనం టైగర్‌ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం నమోదు చేసిన వార్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఆదివారం పన్నెండో రోజు వార్‌ మూవీ ఏకంగా రూ 14 కోట్లు రాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 271 కోట్లు కలెక్ట్‌ చేసింది. రూ 300 కోట్ల క్లబ్‌పై కన్నేసిన వార్‌ మూవీ కబీర్‌సింగ్‌ వసూళ్లను త్వరలో అధిగమించి ఈ ఏడాది భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవనుంది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్‌ వసూళ్లను రాబట్టిన మూవీగా వార్‌ రికార్డు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వార్‌ సక్సెస్‌పై ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ మూవీ యూనిట్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. హాలీవుడ్‌ తరహాలో యాక్షన్‌ దృశ్యాలను తెరకెక్కించేందుకు తాము పడిన కష్టం తెరపై కనిపించిందని, ప్రేక్షకులు తమ కష్టాన్ని గుర్తించి సినిమాకు భారీ విజయం కట్టబెట్టారని హీరో హృతిక్‌ రోషన్‌ అన్నారు. హృతిక్‌, టైగర్‌ల యాక్షన్‌ సన్నివేశాలతో పాటు వార్‌లో హీరోయిన్‌ వాణీ కపూర్‌ తన గ్లామర్‌ షోతో ఆకట్టుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top