సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ! | Hrithik Roshan Cousin Pashmina May Make Her Bollywood Entry In 2020 | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి స్టార్‌ హీరో చెల్లెలు ఎంట్రీ!

Nov 4 2019 11:37 AM | Updated on Nov 4 2019 11:44 AM

Hrithik Roshan Cousin Pashmina May Make Her Bollywood Entry In 2020 - Sakshi

ముంబై : బాలీవుడ్‌లో మరో వారసురాలికి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ చెల్లెలు పశ్మినా రోషన్‌ సినిమాల్లో ప్రవేశించనున్నారు. రాజేశ్‌ రోషన్‌ కుమార్తె అయిన పశ్మిన్‌ను హృతిక్‌ తండ్రి రాకేశ్‌ రోషన్‌ తన నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్న పశ్మీనా ఓ ప్రముఖ యాక్టింగ్‌ స్కూళ్లో శిక్షణ తీసుకుందని... 2020వ సంవత్సరంలో ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని బీ- టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 

కాగా హృతిక్ కూడా తన చెల్లెలు సినిమాల్లోకి రావడం పట్ల సంతోషంగా ఉన్నట్లు రోషన్‌ కుటుంబ సన్నిహిత వర్గాలు ముంబై మిర్రర్‌కు తెలిపాయి. అంతేగాకుండా ఇప్పటి నుంచే ఎటువంటి కథలు ఎంపిక చేసుకోవాలన్న అంశంపై ఆమెకు సూచనలు ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా చైల్‌‍్డ ఆర్టిస్టుగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హృతిక్‌... కహోనా ప్యార్‌ హై సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. క్రిష్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న.. హృతిక్‌ బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌గా పేరొందాడు. హృతిక్‌ నటించిన ‘వార్‌’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement