రూ. 250 కోట్ల మార్క్‌పై కన్నేసిన 'వార్‌'

Hrithik Roshan And Tiger Shroff Film Eyes Rs 250 Crore By War Movie - Sakshi

ముంబై : బాక్సాఫీస్‌ వద్ద వార్‌ జోరు కొనసాగుతూనే ఉంది. అక్టోబర్‌ 2 గాందీ జయంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన వార్‌ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది. విడుదలైన తొలి వారంలోనే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వార్‌ సినిమా 250 కోట్ల మార్క్‌పై కన్నేసింది. తాజాగా రెండో వారంలోకి అడుగుపెటిన ఈ సూపర్‌ కాంబినేషన్‌ సినిమా ప్రతిరోజు రూ. 9 కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తూ తొమ్మిదిరోజులకు గానూ రూ. 238 కోట్లు వసూలు చేసింది.10 వ రోజున వీకెండ్‌ కావడం, బాలీవుడ్‌లో మంచి సినిమాలు లేకపోవడంతో ఆదివారంతో వార్‌ సినిమా రూ. 250 కోట్ల మార్క్‌ను ఈజీగానే క్రాస్‌ చేసేలా కనిపిస్తోంది.

ఇక తెలుగు, తమిళ్‌ భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు నుంచే కలెక‌్షన్లను అదరగొడుతూ రెండో వారం నుంచే లాబాలు తీసుకోవడం మొదలుపెట్టింది. బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌, యువ సంచలనం టైగర్‌ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్‌ మూవీ ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ భారత్‌ లైఫ్‌టైమ్‌ బిజినెస్‌ను అధిగమించి 2019 ఏడాదిలో రెండో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలబడింది. ఇక 2019లో బాలీవుడ్‌ అత్యధిక వసూళ్లు సాధించిన కబీర్‌సింగ్‌ మూవీ( రూ. 379 కోట్లు)ని అధిగమిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.

ఇక హృతిక్‌ రోషన్‌ 'వార్‌' సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో లీడ్‌ క్యారక్టర్స్‌లో నటించిన హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ల నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా హృతిక్‌ తన లుక్స్‌, బాడీ ఫిజిక్‌, యాక్షన్‌ సీన్స్‌తో యూత్‌కు పిచ్చెక్కించాడు. ఇక టైగర్‌ ష్రాఫ్‌ చేసిన యాక‌్షన్‌ సీన్స్‌కు ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది.  

అలాగే వార్‌ సినిమా కోసం హృతిక్‌ రోషన్ తన బాడీనీ మేకోవర్‌ చేసిన విధానాన్ని 'కబీర్‌ ట్రాన్స్‌పార్మేషన్‌ ఫర్‌ వార్‌' పేరుతో వీడియో రూపంలో సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తన బాడీ ఫిజిక్‌ను మార్చుకోవడానికి హృతిక్‌ భారీ కసరత్తులే చేయాల్సి వచ్చింది. తాజాగా వార్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బాస్టర్‌ రన్‌ను కొనసాగిస్తుడంతో ఆ కష్టాన్ని మరిచిపోయేలా చేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top