మేము సైతం | How many difficulties in life | Sakshi
Sakshi News home page

మేము సైతం

Oct 7 2016 11:08 PM | Updated on Sep 4 2017 4:32 PM

మేము సైతం

మేము సైతం

జీవితంలో ఎన్ని కష్టాలున్నా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ.. జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులకు మేము సైతం అంటూ

జీవితంలో ఎన్ని కష్టాలున్నా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ.. జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులకు మేము సైతం అంటూ టాలీవుడ్ తారలు ‘మేముసైతం’ కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవ ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తోంది. ఈ వారం ‘మేముసైతం’లో...

 
15 సంవత్సరాల క్రితం భర్త చనిపోగా, ఇద్దరు కూతుళ్లను పోషించడానికి బుక్‌స్టోర్‌లో పనిచేస్తున్న జానకి, ఆమె పెద్ద కూతురు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్షవాతం వల్ల కాలు, చెయ్యి పడిపోయిన పెద్దకూతురికి వైద్యం చేయించడానికి అండగా.. యంగ్ హీరో నాగచైతన్య సెల్ఫీలు దిగి వినూత్న సేవ చేశారు. ఒంటరి పోరాటం చేస్తూ జీవితాన్ని గడుపుతున్న జానకి కష్టాల్ని తీర్చడానికి నాగచైతన్య చేసిన వినూత్న సేవతో ‘మేముసైతం’ ఈ శనివారం రా.9:30కు ప్రసారం కానుంది. తప్పక చూడండి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement