అది తన నిర్ణయమే.. కానీ అది విని షాకయ్యాను!

Himansh Kohli Cleared About His  Break Up With Neha Kakkar  - Sakshi

బాలీవుడ్‌ నటుడు హిమాన్ష్‌ కోహ్లి ప్రముఖ సింగర్‌ నేహ కక్కర్‌తో విడిపోవడంపై వివరణ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హిమాన్ష్‌ మాట్లాడుతూ.. వారిద్దరూ విడిపోవడం అనేది నేహా నిర్ణయమే అని స్పష్టం చేశాడు. కానీ నేహా సోషల్‌ మీడియా పోస్టులు, పలు షోలలో కన్నీరు పెట్టుకోవడం చూసి అందరూ తననే నిందించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక అసలు విషయం చెబుతూ.. ‘అసలు నేను నేహాతో విడిపోవాలనుకోలేదు. అది తన నిర్ణయమే. ఒక ప్రేమికుడిగా తన నిర్ణయాన్ని గౌరవించాను. అయితే మా బ్రేకప్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో ముందుగా నేహా వెల్లడిస్తూ.. ఇక మా మధ్య ఎలాంటి బంధం లేదని, తన హృదయం ముక్కలైందని, నిరాశలో కూరుకుపోయానంటూ చేసిన పోస్టు చూసి షాక్‌కు గురయ్యాను. ఇక అది చూసి నెటిజన్లంతా నన్ను నిందించడం మొదలు పెట్టారు. మా బ్రేకప్‌కు కారణం నేనేనని వారంతా నాపై విరుచుకుపడుతూ మోసగాడిగా చూడటం నాకు చాలా బాధను కలిగించింది. నిజం చెప్పాలంటే నా జీవితంలో అవి చాలా క్లిష్టమైన రోజులు కూడా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ పోస్టులకు చాలాసార్లు స్పందిద్దామనుకుని.. మెసేజ్‌లు కూడా టైప్‌ చేసి ఆగిపోయిన రోజులు ఉన్నాయన్నాడు. ఒకప్పుడు తనని ప్రేమించాను కాబట్టే నేహాను చేడుగా చూపించడం ఇష్టం లేక రిప్లై ఇవ్వలేదని  చెప్పుకొచ్చాడు.

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

అంతేగాక ‘నేహాను నా సినిమా కెరీర్‌ కోసం ప్రేమించానంటూ వార్తలు వచ్చాయి. నిజానికి చాలా మంది కూడా అదే అనుకున్నారు. అసలు విషయం వారికి తెలియదు. నేహాతో ప్రేమకు ముందు నా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. కారణం నేహా మ్యూజిక్‌ షోల కోసం తనతో పాటు విదేశాలకు వెళ్లడం, తనతోనే ఎక్కువ సమయం గడుపుతూ సినిమాల్లో తక్కువగా నటించాను’ అని చెప్పాడు. ఇక నిజానికి ఏం జరిగిందన్న విషయం ప్రజలకు అవసరం లేదు. వారికి కనిపించిందే నిజమని నమ్ముతారు. దానితోనే ఇతరులను నిందిస్తారు తప్ప.. అసలు విషయం ఎవ్వరూ తెలుసుకోవాలనుకోరు అన్నాడు. ఇక ఏది ఏమైనా చివరకు నేహాను తాను మోసం చేయలేదని సోషల్‌ మీడియాలో స్పష్టం చేసినందుకు సంతోషంగా ఉందని హిమాన్ష్‌ పేర్కొన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top