షార్ట్‌ ఫిలింలో లక్కీ హీరోయిన్‌ | Heroine Rashmika Mandanna Short Film | Sakshi
Sakshi News home page

Sep 28 2018 3:39 PM | Updated on Sep 28 2018 3:39 PM

Heroine Rashmika Mandanna Short Film - Sakshi

టాలీవుడ్ లో ఫుల్‌ ఫాంలో ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఛలో, గీత గోవిందం సినిమాలతో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇటీవల దేవదాస్‌తో మరో సక్సెస్‌ను అందుకుంది. దీంతో రష్మికను లక్కీ హీరోయిన్‌గా భావిస్తున్నారు తెలుగు స్టార్స్‌. ప్రస్తుతం టాలీవుడ్‌ లో బిజీగా ఉన్న రష్మిక ఓ షార్ట్‌ ఫిలింలో సందడి చేసింది. ‘ఎవ్రీ నాన్‌ తెలుగు ఫ్రెండ్ ఎవర్‌’ పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిలిం రష్మిక తెలుగు రాని కన్నడ అమ్మాయిగా కనిపించింది.

తనకు తెలుగు రాకపోవటంతో ఎవరైన తెలుగులో మాట్లాడిన విషయాలను తెలుసుకునేందుకు తన ఫ్రెండ్‌ సాయం తీసుకోవటం, సినిమాలకు తన ద్వారా డబ్బింగ్ చెప్పించుకోవటం లాంటి సీన్స్‌ను ఫన్సీగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ దమ్ము సినిమా చూసి రష్మిక ఇచ్చిన రియాక్షన్స్‌ సూపర్బ్‌. ప్రస్తుతం ఈ షార్ట్‌ ఫిలిం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement