తాత కాబోతున్న విలక్షణ హీరో | Hero Vikram Become A Grandfather Soon | Sakshi
Sakshi News home page

తాత కాబోతున్న విలక్షణ హీరో

Jul 21 2020 4:01 PM | Updated on Jul 21 2020 4:27 PM

Hero Vikram Become A Grandfather Soon - Sakshi

చెన్నై : విలక్షణ నటుడు విక్రమ్‌ త్వరలో తాత కాబోతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఆయన కుమార్తె అక్షిత.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. విక్రమ్‌, శైలజ దంపతులు గ్రాండ్‌ పేరెంట్స్‌గా కానునుండంతో.. వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ఈ వేడుకను చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్‌ చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది.(షారుఖ్‌ బంగ్లాకు ప్లాస్టిక్ ముసుగు)

కాగా, విక్రమ్‌-శైలజ దంపతులకు కుమార్తె అక్షిత, కుమారుడు ధ్రువ్‌ ఉన్నారు. అక్షితకు మను రంజిత్‌తో 2017లో వివాహం జరిగింది. మరోవైపు ధ్రువ్‌ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా విక్రమ్‌, ధ్రువ్‌ హీరోలుగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది.(‘నవరస’లో నటించనున్న తెలుగు హీరోలు వీరేనా?

Advertisement
 
Advertisement
Advertisement