జగ్గా జాసుస్‌పై అమూల్‌ సూపర్‌ కార్టూన్‌ | Har Jagga Khao Amul cartoon on Jagga Jasoos | Sakshi
Sakshi News home page

జగ్గా జాసుస్‌పై అమూల్‌ సూపర్‌ కార్టూన్‌

Jul 16 2017 1:27 PM | Updated on Sep 5 2017 4:10 PM

జగ్గా జాసుస్‌పై అమూల్‌ సూపర్‌ కార్టూన్‌

జగ్గా జాసుస్‌పై అమూల్‌ సూపర్‌ కార్టూన్‌

దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత అనురాగ్ బసు తెరకెక్కించిన చిత్రం జగ్గా జాసుస్ ఎట్టకేలకు జూలై 14 న విడుదలైంది.

ముంబై: దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత అనురాగ్ బసు తెరకెక్కించిన చిత్రం జగ్గా జాసుస్ ఎట్టకేలకు జూలై 14 న విడుదలైంది. ఈచిత్రంలో రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. పలు ఆందోళనలతో ఈ చిత్రం మూడేళ్ల పాటు విడుదల కాకుండా ఉంది. పసందైన మ్యూజిక్‌, అడ్వెంచర్‌లతో సినిమా ప్రేమికులను అలరిస్తోంది. సినిమాటోగ్రఫీ సినిమాని మరో అంచుకు తీసుకెళ్లింది.

సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రంపై అమూల్ బ్రాండ్ ప్రత్యేక కార్టూన్తో ముందుకు వచ్చారు. తమ కార్టూన్‌ పోస్టర్‌లో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్‌లకు నమూనాగా అందమైన అమ్మాయి, అబ్బాయిల ఫొటోలతో ఈ సినిమా పోస్టర్‌ తయారు చేసింది. అంతే కాకుండా 'హర్ జగ్గా ఖావో' శీర్షిక,  'అమూల్ బ్లాక్‌బ్టస్టర్‌ బట్టర్‌' ట్యాగ్‌లైన్‌తో సినిమా సారాంశం చెప్పడానికి ప్రయత్నించింది. సినిమాలో కామెడీ, రొమాన్స్, మ్యూజిక్, అడ్వెంచర్ చాలా ఉన్నాయని, అమూల్ వెన్నలో కూడా అన్నీ ఉన్నాయని అమూల్‌ పోల్చింది. ఫ్రెంచ్ వంటకాలు ఎన్ని ఉన్నా దేసీ పావ్ భాజీ, లేకుండా అసంపూర్తిగా ఉంటుందనే సందేశాన్ని అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement