శ్వేతాబసుప్రసాద్‌కి బాలీవుడ్ ఆఫర్! | Hansal Mehta may offer Shweta Prasad role in his film | Sakshi
Sakshi News home page

శ్వేతాబసుప్రసాద్‌కి బాలీవుడ్ ఆఫర్!

Sep 6 2014 1:10 AM | Updated on Apr 3 2019 7:03 PM

శ్వేతాబసుప్రసాద్‌కి బాలీవుడ్ ఆఫర్! - Sakshi

శ్వేతాబసుప్రసాద్‌కి బాలీవుడ్ ఆఫర్!

మంచి చేసినప్పుడు వచ్చే ప్రచారం కన్నా చెడు చేసినప్పుడే వచ్చే ప్రచారం భారీ ఎత్తున ఉంటుంది.

మంచి చేసినప్పుడు వచ్చే ప్రచారం కన్నా చెడు చేసినప్పుడే వచ్చే ప్రచారం భారీ ఎత్తున ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణ శ్వేతాబసు ప్రసాద్. ఇప్పుడెక్కడ చూసినా ఆమె గురించే. ఇటీవల శ్వేత వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. మూడు నెలల పాటు ఆమె రెస్క్యూ హోమ్‌లో ఉండాల్సిందిగా కోర్టు ఆదేశించింది. హఠాత్తుగా తన జీవితం ఇలాంటి మలుపు తీసుకుంటుందని శ్వేత ఊహించి ఉండరు. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబం కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని శ్వేత పేర్కొనడం గమనార్హం. ఆ సంగతలా ఉంచితే.. దాదాపు అందరూ ఆమెను వ్యతిరేకిస్తున్న సమయంలో బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఆమెకు అండగా నిలబడటం విశేషం.

‘‘శ్వేత ఫొటోలను ప్రచురించడం ఆపండి. ఆ రోజు ఆమెతో పాటు ఉన్న ఆ బడా క్లయింట్ల ఫొటోలను బయటపెట్టండి. అలాగే, ఆ వ్యవహారానికి వారధిగా ఉన్న ‘మధ్యవర్తి’ ఫొటోను బయటపెట్టండి’’ అని ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు హన్సల్ మెహతా. ‘మక్డీ’ చిత్రంలో బాలనటిగా శ్వేతా అభినయం తనకింకా గుర్తుందనీ, బాగా నటించిందని ఆయన పేర్కొన్నారు. అందుకే, తన తదుపరి చిత్రంలో ఆమెకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు కూడా హన్సల్ అన్నారు. జయతే, దిల్ పే మత్ లే యార్, ఉడ్‌స్టాక్ విల్లా తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత హన్సల్‌ది. గత ఏడాది‘షాహిద్’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి ప్రతిభా వంతుడు తనకు అండగా నిలవడం శ్వేతకు ఊరటగా ఉంటుందని ఊహించ వచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement