breaking news
rescue home
-
ఆ పిల్లల స్థితిగతులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణా నుంచి యాదాద్రిలో విముక్తి పొందిన మహిళలు, ఆడపిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజ్వల రెస్క్యూ హోమ్‌లోని 26 మంది పిల్లల స్థితిగతులపై జూలై 9లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. యాదాద్రిలో పిల్లలకు పోలీసులు విముక్తి కల్పించి సంరక్షణ గృహాలకు తరలించారు. వారిలో 26 మంది ప్రజ్వల అనే ఎన్జీవో సంస్థ నిర్వహించే రక్షణ గృహంలో గత జూలై నుంచి ఉంటున్నారు. సంరక్షణ గృహంలో ఉన్న పిల్లల జీవన పరిస్థితులను తెలుసుకోవాలని భావిస్తున్నామని, పిల్లలకు ఏ ఆహారం అందజేస్తున్నారో, వారికి అవసరమైనప్పుడు ఏ మందులు వాడుతున్నారో, విద్యా బోధన ఎలా ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కిడ్నాప్, తప్పిపోయిన పిల్లలను వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు.. ఆ పిల్‌ను మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ వాదిస్తూ.. సంరక్షణ గృహంలో పిల్లలు క్షేమంగానే ఉన్నారని, రక్షణ దృష్ట్యా వారి ని పాఠశాలలకు పంపలేకపోతున్నామని చెప్పారు. అయితే ప్రజ్వల హోం నిర్వాహకులు అక్కడే వారికి విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. పిల్లలను తాము దత్తత తీసుకున్నామని చెప్పి కొంతమంది పిల్లలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అనుమతించడం లేదన్నారు. ప్రజ్వల హోం తరఫు న్యాయవాది దీపక్ మిశ్రా వాదిస్తూ.. హోంలో 150 మంది ఉండేందుకు సరిపడా వసతులున్నాయని, పిల్లలకు తగిన రీతిలో యోగక్షేమాలను నిర్వాహకులు చూసుకుంటున్నారని తెలిపారు. విచారణ వచ్చే నెల 9కి వాయిదా పడింది. -
దశావతారం
కథ స్త్రీల కోసం ఒక సంస్థ రెస్క్యూ హోం నడుపుతుంటే అక్కడ నాకు డ్యూటీ వేసారు. ప్రేమ పేరుతో వంచించబడ్డ అమ్మాయిలు, బ్రోతల్ హౌస్‌ల నుండి రక్షించబడిన వాళ్ళు ఇలా అందరూ ఒక రకంగా జీవచ్ఛవాలే. అవును సార్ నేను నిద్రపోయి చాలా సంవత్సరాలే అయింది. హోటల్లో ఆయన పెట్టించిన సాంబారు ఇడ్లీ తింటూ చెప్పాను. బెయిలు మీద విడిపించి సరాసరి ఇక్కడకు తీసుకొచ్చాడు. మూడు నెలలైంది జైలుకెళ్ళి. బెయిలు దొరకడం కష్టమే అన్నారు. మరి ఈ పెద్దాయన ఎలా ఇప్పించాడో, ఎందుకు ఇప్పించాడో తెలీదు. ఉన్న మూడు నెలల్లో పక్క ఖైదీలు ఒకటే గొడవ వీడేంటి సార్ అసలు నిద్రపోడు, గుడ్లగూబలా! ఏరా పారిపోడానికి పథకాలేస్తున్నావా? అని సెంట్రీలు వెటకారమాడేవాళ్ళు. ఎక్కడ నుండి ఎక్కడికి పారిపోవాలి.జైల్లో కూర్చుని నా ఆత్మ కథ రాసుకోడానికి నేనేం మహాత్ముడిని కాను కానీ పాపాత్ముడినీ కాను. మరి సహాయం చేసిన ఈ బాబు అడిగితే నా కథ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ప్రస్తుతం ఇరవై రెండో ఏడు... అసలు నేనెందుకు మందు తాగుతాను చెప్పండి. నాకు పదేళ్ళు నిండకుండానే మా నాన్న తాగి తాగి మా అమ్మని చావగొట్టాడు. తర్వాత వాడు చచ్చాడు. మరి ఆ రోజు తాగి పట్టుబడ్డవేంటి అంటారా. అరేయ్ తాగుడు అలవాటు లేదా అని పగలబడి నవ్వి నా ముక్కు మూసి అర గ్లాసు మద్యం నోట్లో పోసారండి ఖాకీ బాబులు. ఒరేయ్ అమ్మాయిల (సభ్యత కోసం ఈ మాట) కంపెనీలో ఇమడలేకపోయా అన్నావ్, రెస్క్యూ హోంలో తిన్నగా ఉద్యోగం చేసావా, ఎవతినో ప్రేమించావట, అది జెల్ల కొట్టిందట, నువు తన్నులు తిని ఉద్యోగం పోగొట్టుకున్నావు, బార్లో బౌన్సర్ ఉద్యోగం పోయిందా. నీ బ్యాక్‌గ్రౌండ్ తెలీక ఇదిగో ఈ అయ్యగారు నెల క్రితం డ్రైవర్ ఉద్యోగం ఇచ్చారు. ఎంత కృతజ్ఞత ఉండాలి. పెద్దింటి అమ్మాయి జైలుకెళ్తే పెళ్ళవుతుందా. వెంటనే బెయిలు వచ్చే ఏర్పాటు చేస్తారు. ఆర్నెల్లో, యేడాదో శిక్ష వేస్తారు. బయటికొచ్చాక మూడు లక్షలు ఇప్పిస్తాం. వ్యాపారం చేసుకుందువు అని నచ్చ చెప్పారు. ఈ పోలీసులే నా బాల్యంలో వ్యాపారం కోసమని పోగుచేసుకున్న ఐదు వేలు ఎక్కడ దొంగతనం చేసావురా అని లాగేసుకున్నారు. పబ్‌లో ఫుల్లుగా తాగేసి రేయ్ నువు తప్పుకో అని మహా తల్లి డ్రైవింగ్ మొదలుపెట్టింది. ఫుట్‌పాత్ పైకి ఎక్కేసిన కారు. తాగిన మత్తు వదిలి డ్రైవింగ్ సీట్లో నుండి కంగారుగా దిగింది. పక్క సీట్లో నుండి నేనూ కంగారుగా దిగాను. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది. ఆయనవి ఎన్ని తలలు తీసి సంపాయించిన తెలివితేటలో. డ్రైవర్ కారు కొంచెం వెనక్కి తీస్తావా అంది. సరేనమ్మా అని నేను డ్రైవింగ్ సీట్లో కూర్చునేసరికి జనం పోగడ్డారు. ఫుట్ పాత్‌పై ఒకడు చచ్చి పడున్నాడు. ఇంకోడు చావు బతుకుల్లో. బెయిలు గురించి పట్టించుకున్నోడే లేడు. తాగి కారు నడిపానని, తప్పు జరిగిందని వొప్పేసుకున్నా కద. ఇదిగో మీరు వచ్చి ఏర్పాటు చేసారు. నాకు నిద్ర పట్టకపోవడానికి ఇది కారణం కాదు. నా ఇరవై ఒకటో యేట.... జీవచ్ఛవాలు మా నాన్న పర్సనాలిటీయే వచ్చింది నాకు. పహిల్వాన్లా ఉండేవాడు. ఎందుకూ పనికిరానోడు కానీ కోస్తే వూరికి సరిపోతాడు అనేవాళ్ళు.సెక్యూరిటీ కంపెనీ వాళ్ళు నన్ను గార్డ్‌గా తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ పని చెయ్యాలి. ఎవడో చెప్పాడు. మా తరఫున పది వేలు తీసుకుని మాకు ఐదు వేలు ఇస్తారంట. స్త్రీల కోసం ఒక సంస్థ రెస్క్యూ హోం నడుపుతుంటే అక్కడ నాకు డ్యూటీ వేసారు. ప్రేమ పేరుతో వంచించబడ్డ అమ్మాయిలు, బ్రోతల్ హౌస్‌ల నుండి రక్షించబడిన వాళ్ళు ఇలా అందరూ ఒక రకంగా జీవచ్ఛవాలే. సినిమా మోజుతో ఇల్లొదిలి పారిపోయి మళ్ళీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళే ధైర్యం చేయలేని ఆడ పిల్లలు. ఇది మళ్ళీ ఒక ఖైదు అని పారిపోవడానికి ప్రయత్నించే వాళ్ళు తక్కువ కాదు. వాళ్ళు పారిపోకుండా చూడడమే నా పని. ఒక అమ్మాయి ఏ కారణం వల్ల అక్కడ ఉందో తెలీదు కానీ నాకు బాగా నచ్చింది. ఏంట్రా బాబూ ఇంతందంగా ఉన్నావు. ఈ ఉద్యోగం ఏం ఖర్మ. సినిమాల్లో ప్రయత్నం చేస్కో అంది మొదటి రోజే. అంతవరకూ ఏ అమ్మాయీ నాతో అంత చనువుగా మాట్లాడింది లేదు.నాకా అమ్మాయి అంటే విపరీతమైన ఇష్టముండేది. నన్ను ఏరా అని పిలిచేది. నాతో తెగ పరాచికాలాడేది. సెక్సీగా మాట్లాడి కవ్వించేది. కోపమొస్తే నీ యయ్య అనేది.నాతో మొైబల్ రీచార్జ్, నెట్ రీచార్జ్ చేయించుకునేది. నా పుట్టిన రోజుకి బహుమతేం కొంటావురా, దీపావళికి కొత్త చీర కొను అని ఏదో ఒక సందర్భం చెప్పి సతాయించి కొనిపించుకునేది. గంటల తరబడి సెల్లో మాట్లాడేది. మా అమ్మావాళ్ళని, బంధువులని చెప్పేది.నాకో లక్ష రూపాయలు కావాల్రా. అడిగింది ఒకసారి. ఎందుకు? స్థలం కొనుక్కోవాలని నా డ్రీం. నా పేరున అంటూ స్థలం ఉంటే అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. ఎంత చిన్నదయినా సరే నాది అనే ఫీలింగ్ చూసావూ ఎంత బాగుంటుందో!అవును, నాది అనే ఫీలింగ్. నువ్వు నా దానివి ఐషూ అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది అన్నాను. కిలకిలా నవ్వింది. అన్నట్టు మన శోభనం అక్కడే అంది. నా దగ్గర యాభై వేల వరకూ ఉన్నాయి అని చెప్పాను. ఆ డబ్బు ఎవరో స్నేహితుడి అకౌంట్ ఇచ్చి అందులో వేయించుకుంది. మిగతా డబ్బు తొందరగా సర్దరా బాబూ అంది.నా దగ్గర లేవే అంటే అప్పు చెయ్ నాయనా నాకోసం చెయ్యలేవారా అని ముద్దుగా అడిగింది. ‘నన్ను వదిలి వెళ్ళవుగా’ బేలగా అడిగేవాడిని చాలా సార్లు. నువ్వో, నేనో చచ్చేదాకా వదలను సరేనా నమ్మకంగా చెప్పేది.మాకు ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం దొరికేది కాదు. నాకు ఎస్.ఎం.ఎస్ లు ఇవ్వడం బాగా అలవాటు చేసింది. పరాచికాలు, అలగడాలు, దెబ్బలాడడం మళ్ళీ కలిసిపోవడం, ముద్దులు అన్నీ ఎస్.ఎం.ఎస్ లోనేనేనేదైనా సరదాగా మాట్లాడితే నా మూతి మీద సుతారంగా వేలితో కొట్టేది. నా వేలు కొరికేది. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలకే పరవశించి పోయేవాడిని. ఆ అమ్మాయి మీద నా ఇష్టం అమాంతం పెరిగిపోయేది.ఏం మాట్లాడతావు అంతంతసేపు అనడిగితే నా మీద అనుమానం కదా మనం విడిపోదాం అనేది. ఒద్దొద్దు అదేంలేదు అని కంగారు పడేవాడిని.ఒకసారి ఎవర్తోనో ఒరేయ్ అని మాట్లాడేస్తోంది. నా క్లాస్ మేట్. నువు నమ్మవు. సరే సిమ్ విరగొట్టేస్తా అంది.చచ అదేం లేదు అన్నాను. మూడు రోజులు నా వంక చూడలేదు. బాధతో విలవిల్లాడిపోయాను.నాలుగో రోజు నా వంక చూసింది. నా కళ్ళల్లో నీళ్ళు చూసి నా కోసం ఏడ్చావురా బంగారం నిన్ను చాల బాధ పెట్టాను కదా సారీరా అంది. నేను కరిగిపోయాను.ఎంతకాలం ఇలా పారిపోవడానికి పథకం వెయ్యి అంది. నేను నీ భుజాలమీద ఎక్కి గోడ అవతలికి దూకి నా చున్నీ నీకు అందిస్తానంటే సరే అన్నాను. దాని చున్నీ ఇవతలకి రాలేదు కానీ రెస్క్యూ హోం వాళ్ళు నా వెనకాల వచ్చారు. నా వొళ్ళంతా చీరిపోయి రక్తం వచ్చేలా కొట్టారు.తర్వాత కానీ తెలీలేదు అది నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయిందని. గోడ అవతల దాని అసలు ప్రియుడు కాచుకుని ఉన్నాడట. సంవత్సరం పాటు ఏడ్చాను. నాకు నిద్ర పట్టకపోవడానికి ఇదీ కారణం కాదు. నా పద్దెనిమిదో యేట... చెప్పాను కదా, మా నాన్న పుణ్యమా అని నేను మంచి వొడ్డూ, పొడుగూ ఉంటాను. చెత్త ఏరడం అనే మంచి పని మానేసాక చాలా చెత్త పనులు చేసాను. వాటిల్లో కొన్ని... క్లబ్లో బౌన్సర్‌గా అంటే తాగి ఎవడన్నా గొడవ చేస్తుంటే వాడ్ని బయటకు విసిరేయడమన్న మాట. బార్లో నుండి ఒకతను తూలుతూ బయటకు వచ్చాడు. బయట అతడి భార్య అనుకుంటా... తాగి ఇల్లు గుల్ల చేస్తున్నావంటూ గొడవ పెట్టుకుంది. అతను కోపంతో ఆమెను ఇష్టమొచ్చినట్లు చేతులతో, కాళ్లతో తన్నడం మొదలుపెట్టాడు. అందరూ చోద్యం చూస్తున్నారు. ఆమె ప్రతిఘటించ లేక ఏడుస్తోంది. ఆమెను చూస్తే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. వాడిని చితక బాదేశాను. కస్టమర్లు దేవుళ్లంటా, క్లబ్ వాళ్లు నా ఉద్యోగం పీకేశారు. ఒక రోజు ట్రాఫిక్ లైట్ల దగ్గర ఆటోలో కూర్చుని ఉంటే పక్కన ఒక కారు ఆగింది. కార్లో కూర్చున్న వాడు నన్నే చూస్తున్నాడు. గుర్తు పట్టాను. రాకేష్! చెత్త యేరే నేస్తుడు. నంబర్ ఇచ్చాడు తర్వాత కలవరా అని. వాడి ఆఫీస్ హంగామా చూసి ఆశ్చర్యపోయాను. అందరికీ ఉద్యోగాలిప్పించడమే నా ఉద్యోగం అన్నాడు. హోం అసిస్టెంట్ అని బాగా డబ్బున్న వాళ్ళింట్లో పని అన్నాడు. మూడో రోజే తెలిసింది. వాడు ఇప్పించింది మగ వేశ్య ఉద్యోగమని. పారిపోయాను. నా పన్నెండో యేట.... ఎప్పటిలాగే గోనె సంచీ భుజాన వేసుకుని చెత్త ఏరడానికి బయలుదేరాను నా నేస్తులతో కలిసి. అవును సార్ మీబోటి వాళ్ళు పనికిరావని పారేసిన వస్తువులే మాకు బతుకు తెరువు. ప్లాస్టిక్, గాజు, ఇత్తడి లాంటి విరిగిపోయిన ముక్కలు పట్టుకెళ్ళి రీసైకిల్ చేసే వ్యాపారస్తులకి అమ్ముతాం. అచ్చం మా బతుకుల్లా ఉండే పగిలిపోయిన అద్దాలు, గాజు సీసాలు, తెగిపోయిన చెప్పులు, విరిగిపోయిన మొబైల్ ఫోన్ అన్నీ మా పొట్ట నింపేవే. మాకు జబ్బులు వచ్చినా బ్యాటరీలు, కంప్యూటర్ పార్టులు కాలిస్తే వచ్చే రాగితో డబ్బులు వస్తాయి. ఏవో పెద్ద పెద్ద కంపెనీలట ఈ పని కోసం పోటీ పడుతున్నాయని అవి వస్తే మన పని గోవిందా అని రాకేష్ గాడు చెప్పాడు. ఎందుకూ మంత్రులెవరన్నా ఆ ఏరియాకి ఏ పని మీద వచ్చినా ఆ రోజుకి మా పని ఖాళీయే.ఒక రోజు చెత్త ఏరుతుంటే మూటలో కట్టి ఉన్న పసి...... ఆ పని మానేసాను. నాకు నిద్ర పట్టకపోవడానికి ఇది కూడా కారణం కాదు. మేం ఉండే చోట ఓ ముసలాయన చెట్టు కింద కూర్చుని డప్పు కొడుతూ ఉండే వాడు. పక్కన కూర్చుని చూసేవాణ్ణి. నేర్చుకుంటావా అబ్బాయ్ అని నా ఆసక్తి చూసి నేర్పించాడు. చేప పిల్ల ఈత కొట్టినంత సహజంగా ఒక్కరోజులోనే ఆ విద్య పట్టుబడింది. రా రా అబ్బాయ్ పనిబడింది అంటూ మరుసటి రోజు ఆ తాత నన్ను వెతుక్కుంటూ వచ్చాడు.డంగు టక్కు టక్కు టక్కు డంగు టక్కు టక్ అంటూ శవం ముందు వాయించే చావు బాజా. నా అరంగేట్రం అదిరింది. డబ్బులు బాగా ముట్టినై. తాత నన్ను పొగిడాడు. డప్పు కొట్టామా డబ్బులు తీసుకున్నామా అంతే శవం ఎవరిదన్న సంగతి మనకవసరం లేదు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు. అదొక పార్ట్ టైం ఉద్యోగం అయింది. ఒక సందర్భంలో శవం ముఖం యథాలాపంగా చూస్తే మా నాన్నలా అనిపించాడు. రెండోసారి చూడలేదు. జీవన తరంగాలు సినిమాలో కృష్ణంరాజు లా ఋణం తీరిపోయిందనుకున్నాను. చావు బాజా ఎందుకు వాయిస్తారో తెలీదు కానీ నాకు కొంతకాలం కూడు పెట్టింది. సిరిసిరి మువ్వ సినిమాలోని ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం పాటలో డప్పు వాద్యం మక్కీకి మక్కి దింపేస్తే తాత ఆనంద పడిపోయేవాడు. ఇంకా చాలా పాటల్ని డప్పు మీద వినిపించేవాడ్ని. చుట్టూ ఉన్న నాలాంటి పనికిమాలిన జనం శబ్బాష్ అనో వారెవ్వా అనో అనేవాళ్ళు.అయితే ప్రశంసల జల్లు కురవడానికి ఇదేమన్నా రాక్ బ్యాండా కనీసం బ్యాండు మేళం కూడా కాదు. తాతతో అదే చెప్పాను. పిల్లాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేస్తానంటే తల్లడిల్లిపోయిన మధ్య తరగతి తలిదండ్రుల్లా విలవిల్లాడాడు. నీకు మంచి భవిష్యత్తు ఉందిరా అన్నాడు. నీకు ప్రమోషన్ ఇప్పిస్తాగా అని ఆశ చూపించాడు. పెళ్ళికి బ్యాండు వాయించే వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ పెట్టించాడు. చావు బాజా వాయించే వాడినని వద్దు పొమ్మన్నారు. అయినా ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్ వాయిద్యాలే నువు పనికి రావన్నారు. నేర్పించండి బాబూ పిల్లాడు పైకి వస్తాడని తాత ఎంత బతిమిలాడినా ససేమిరా అన్నారు. ఇక నా నరసింహావతారం గురించి చెప్పి నా కథ ముగిస్తాను. ఈ సంఘటన జరిగాకే ఆ వూరు నుండి పారిపోయాను.అప్పుడు నాకు పదేళ్ళు. కొంచెం వయసుకి మించి కనిపిస్తాను. చెత్త ఏరే ప్రొఫెషన్లోకి అపుడే అడుగు పెట్టాను.ఒక రోజు నా నేస్తుడు, నా కన్నా నాలుగైదేళ్లు పెద్దోడు రేయ్ టేసన్ కాడికెల్దాం ఔటర్ లో ఆగే బళ్ళలో ప్లాస్టిక్ సీసాలు బాగ దొరుకుతై అన్నాడు. అప్పడే చీకటి పడుతోంది. మేం వెళ్ళేసరికి రైళ్లు ఏవీ ఆగి లేవు. అక్కడే పట్టాల పక్కన గోనె సంచీలు వేసుకుని కూర్చున్నాం. బాగా చీకటి పడింది. ఇంతలో ముగ్గురు పోలీసులు వచ్చారు. ఒకడు తెలిసిన వాడే. వీళ్ళకి దొరికిపోయామే అని మా వాడేదో గొణుగుతున్నాడు.రేయ్ ఇట్రండ్రా వాళ్ళ వెనకాలే పట్టాల వెంబడి చాలా దూరం నడిచాం. పట్టాల పక్కన ఒక మనిషి పడి ఉన్నాడు. అప్పటికే అక్కడ ఇంకో పోలీసు ఉన్నాడు. రేయ్ వీడ్ని గోనె సంచిలోకి ఎక్కించండ్రా నాకేం అర్థం కాలేదు. వాడేమైనా తాగి పడిపోయాడేమో అనుకున్నా. అదొక శవం. నాకు కాళ్ళల్లో వణుకు మొదలైంది. ప్రభుత్వ ఆస్పత్రి. శవాన్ని ఒక బల్ల మీద పడుకోబెట్టారు. డాక్టరు అనుకుంటా చేతికి, ముక్కుకి తొడుగులు, అదో రకం కళ్ళ జోడు, మెడ దగ్గర్నుండి మోకాళ్ళ దాకా పచ్చ గుడ్డ ఒకటి కట్టుకుని వచ్చాడు. మా ఇద్దరికీ చేతికి తొడుగులు ఇచ్చారు. ఏం చెయ్యాలి ఇక్కడ. నాకు భయంతో చెమటలు పడుతున్నాయి.శవం మీద ఉన్న బట్టలన్నీ తీసేయించారు మాతో. డాక్టరు శరీరమంతా పరిశీలించి ఏదో చెబుతుంటే ఒకతను రాసుకున్నాడు. తర్వాత తల ఊపాడు.నాతో వచ్చినవాడికి ఇది మొదటిసారి కాదనుకుంటా. వాడికి కొత్త సార్ అన్నాడు. ఐతే వాడితో చేయించరా. ప్రాక్టీస్ ఐతది అన్నాడొకడు. నా చేతికి ఒక కత్తి ఇచ్చారు. నా నేస్తుడు నాతో ఓనమాలు దిద్దిస్తునట్టు నా చెయ్యి పట్టుకుని కత్తితో ఆ శవం భుజాల దగ్గర మొదలుపెట్టి ఛాతీ దగ్గర కలిసి కింద పొత్తికడుపు వరకూ వై ఆకారం లో కోత పెట్టాడు. రక్తం కారింది. వాళ్ళు చెప్పినట్టు పక్కటెముకల పై భాగాన్ని మధ్య ఉన్న బ్రెస్ట్ బోన్ తో సహా పైకి లాగాను. ఇపుడు లోపల ఉన్న అవయవాలన్నీ కనిపిస్తున్నాయి.ఐదో తరగతి వరకూ చదివా కద సార్ మా అమ్మ చనిపోయే వరకు. క్లాస్‌లో ఎప్పుడూ నేనే ఫస్ట్ సార్, జీవశాస్త్రంలో ఐతే నూటికి నూరే. నా కొడుకు డాక్టర్ అవుతాడు అని మురిసిపోయేది మా అమ్మ. పదేళ్ళకే పోస్ట్‌మార్టం చేస్తానని ఊహించి ఉండదు పిచ్చి తల్లి. స్ప్లీన్, పేగులు బయటకి తియ్యమన్నారు. తర్వాత కాలేయం, అన్నవాహిక, పాంక్రియాస్ అన్నీ కలిపి ఒక్కసారిగా బయటకు... చేతులు వణుకుతున్నాయి.రేయ్ ఇపుడు చెవుల వెనకాల నుండి కోయించి పుర్రె బయటకు తీయిస్తారు నా నేస్తుడు చెవిలో చెబుతున్నాడు. దేవుడా, దేవుడా. కడుపులో తిప్పేస్తోంది. భళ్ళున వాంతి చేసుకున్నా. పోలీసులు తిట్టి అదంతా నాతోనే శుభ్రం చేయించి బయటకు పంపేసారు.ఈ పని చేసి ఇరవై నాలుగు గంటలూ శవాలే గుర్తొస్తుంటే మర్చిపోయేందుకు నా నేస్తుడొకడు మత్తు మందులకి బానిస అయిపోయాడు.ఇదంతా జరిగి పదేళ్ళు అయింది. అప్పటినుండీ నేను ఏ రోజూ నిద్రపోలేదు సార్. ఇది సార్. నా చదువు, ప్రేమ, ఉద్యోగాల కథ. నేను చెప్పింది నిజమే సార్. పోయిన సంవత్సరం కటక్ (ఒడిశా)లో పిల్లలతో ఇలానే చేయిస్తుంటే బయటపడి కోర్టు కలగ చేసుకుందండి. కేసు పెట్టారండి. నా జీవితమంతా శవాలతోనూ, చచ్చినట్టు బ్రతుకుతున్న వాళ్ళతోనే ఎందుకు ముడిపడి ఉంది. ఎవరేనా చెప్పండి. నా కథ విని మీకు ఒక్క రాత్రన్నా నిద్ర పట్టకపోతే నా జీవితం ధన్యమైనట్టే. ఎందుకంటే మీరు నాబోటి వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టారనే కదా. అతను కోపంతో ఆమెను ఇష్టమొచ్చినట్లు చేతులతో, కాళ్లతో తన్నడం మొదలుపెట్టాడు. అందరూ చోద్యం చూస్తున్నారు. ఆమె ప్రతిఘటించ లేక ఏడుస్తుంది. ఆమెను చూస్తే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. వాడిని చితక బాదేశాను. కస్టమర్లు దేవుళ్లంటా, క్లబ్ వాళ్లు నా ఉద్యోగం పీకేశారు. ఐదో తరగతి వరకూ చదివా కద సార్ మా అమ్మ చనిపోయే వరకు.క్లాస్‌లో ఎప్పుడూ నేనే ఫస్ట్ సార్, జీవశాస్త్రంలో ఐతే నూటికి నూరే. నా కొడుకు డాక్టర్ అవుతాడు అని మురిసిపోయేది మా అమ్మ.పదేళ్ళకే పోస్ట్ మార్టం చేస్తానని ఊహించి ఉండదు పిచ్చి తల్లి. -
మూగ బాలికపై అమానుషం
-
మూగ బాలికపై అమానుషం
వెంగళరావునగర్: అత్యాచారానికి గురై రెస్క్యూ హోంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికను అదే హోంలో ఉంటున్న యువతి తీవ్రంగా కొట్టి గాయపరిచిన సంఘటన శనివారం స్థానిక యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండేళ్ళ కిందట మెదక్ జిల్లాకు చెందిన ఓ మూగబాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనలో ఆమెను కోర్టు ఆదేశాల మేరకు యూసుఫ్‌గూడ స్టేట్‌హోం ప్రాంగణంలో ఉన్న రెస్క్యూ హోం తరలించారు. కాగా అదే రెస్క్యూ హోంలో ఉంటున్న సన అనే యువతి కొద్దిరోజులుగా మూగ బాలికను తీవ్రంగా కొడుతోంది. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. తోటి యువతులు బాలికను కాపాడుతూ వస్తున్నారు. కాగా బాలిక తాను హోంలో ఉండలేనని, పంపించాలని మూగ సైగలతో ఇన్చార్జిని అడుగుతోందని, అందుకే సనతో ఆమెను కొట్టించిందని ప్రచారం జరిగింది. ఇదే విషయంపై విలేకరులు రెస్క్యూ హోం ఇన్చార్జి నిర్మలను వివరణ కోరగా తాను ఎవరినీ కొట్టించలేదని పేర్కొన్నారు. మూగ బాలిక ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేస్తుండగా స్థానికంగా ఉన్న యువతులు రక్షించారని తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆశ్రిత శనివారం రాత్రి హుటాహుటిన రెస్కూ్యహోంకు వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ విషయంపై విచారణ చేపడుతున్నామని అన్నారు. -
కలుషిత నీరు తాగి 11 మంది పిల్లల మృతి
జైపూర్: ప్రభుత్వ వసతి గృహంలో కలుషిత నీరు తాగి 11 మంది చిన్నారులు మృతి చెందిన సంఘటన రాజస్థాన్ లోని జమ్ డోలీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 21 నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న పిల్లల్ని వసతి గృహ సిబ్బంది చికిత్స నిమిత్తం జైపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకూ 15 మందిలో పదకొండుమంది చిన్నారులు మరణించారు. వీరంతా 15 ఏళ్లలోపు వారే. పిల్లలందరూ మానసిక, అంగ వైకల్యం గలవారని, అందుకే వారికి సోకిన ఇన్ఫెక్షన్ ప్రభావాన్ని తట్టుకోలేకపోయారని జేకే లాన్ ఆసుపత్రి డాక్టర్ అశోక్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది పిల్లలు మెదడువాపు బారిన పడ్డారని వైద్యులు వివరించారు. ఈ ఘటన నేపథ్యంలో సామాజిక శాఖ మంత్రి అరుణ్ చతుర్వేది శుక్రవారం జామ్డోలీలో హోమ్ ను పరిశీలించారు. హోమ్ నిర్వహణలో లోపాలను తెలుసుకోవడానికి ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. హోమ్ లో మినరల్ వాటర్ సదుపాయం లేదని, బోర్ నీళ్లనే తాగుతున్నారని గుర్తించారు. కాగా ఈ దారుణ సంఘటన ప్రభుత్వ వైఫల్యమేనని, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
రెండేళ్ల తర్వాత ఛాన్స్!
‘‘నా ప్రతిభను గుర్తించి అవకాశాలిస్తే ఆనందంగా ఉంటుంది. సానుభూతితో ఇచ్చే అవకాశాలు నాకు అవసరం లేదు’’ అని దాదాపు రెండేళ్ల క్రితం శ్వేతాబసు ప్రసాద్ చెప్పిన మాటలను ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. హిందీ చిత్రం ‘మక్డీ’తో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు సాధించి, అందరి దృష్టినీ ఆకట్టుకున్న శ్వేత, ‘కొత్త బంగారు లోకం’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, తనలో మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందని నిరూపించుకున్నారు. కథానాయికగా మొదటి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత చేసిన చిత్రాలు శ్వేత కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. పైగా వ్యభిచారం కేసు తలకు చుట్టుకోవడంతో నలుగురి నోళ్లలో నానాల్సిన పరిస్థితి. కొన్ని నెలల పాటు రెస్క్యూ హోమ్‌లో ఉన్న శ్వేతాబసు ప్రసాద్‌కు చివరకు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చి, విడుదల చేసింది. ఆ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలోనే శ్వేత పై విధంగా పేర్కొన్నారు. శ్వేతకు అవకాశాలిస్తామని అప్పట్లో కొంతమంది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ, అది జరగలేదు. గత రెండేళ్లల్లో ఆమె సినిమాలు అంగీకరించిన దాఖలాలు లేవు. ఇప్పుడు శ్వేతకు ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ అవకాశం ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం హిందీ రంగంలో దీని గురించే చర్చ. శ్వేతతో కరణ్ జోహార్ ఎలాంటి సినిమా చేయనున్నారు? ఈ చిత్రం మళ్లీ ఈ బ్యూటీకి నటిగా మంచి బ్రేక్ అవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ చిత్రవిశేషాలు తెలియజేయమని శ్వేతాబసు ప్రసాద్‌ను కోరగా, ఆమె మౌనం వహించారు. మౌనం అర్ధాంగీకారం అంటారు కాబట్టి... శ్వేతకు కరణ్ జోహార్ అవకాశమిచ్చినట్లేనని ఫిక్స్ అయిపోవచ్చు. బహుశా ఓ శుభముహూర్తాన అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారేమో! -
రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలికల అదృశ్యం
దుండిగల్: రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలిక లు అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీ స్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన గ్రేసీకర్ (15) ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. దీంతో బాలికను కుత్బుల్లాపూర్ మండ లం చర్చి గాగిల్లాపూర్‌లోని నవజ్యోతి నికేతన్ రెస్క్యూ హోంలో చేర్పించారు. ప్రస్తుతం గ్రేసీకర్ స్థానిక సెయింట్ ఇగ్నీషియస్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా.. ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద తప్పిపోయిన తమిళనాడుకు చెందిన వరలక్ష్మి (14), రెండు నెలల క్రితం జూపార్కు వద్ద తప్పిపోయిన సారా కాటూన్ (17)లను రెస్క్యూ హోంకు తరలించారు.వరలక్ష్మి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా, సారాకాటూన్ రెస్క్యూ హోంలోనే ఉంటోంది. కాగా, శుక్రవారం రాత్రి ఈ ముగ్గురు బాలికలు రెస్క్యూ హోం నుంచి తప్పిం చుకున్నారు. బాలికల ఆచూకీ కోసం ప్రయత్నిం చినా ఫలితం లేకపోవడంతో శనివారం రెస్క్యూ హోం నిర్వాహకులు దుండిగల్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. మరో బాలిక సైతం వెళ్లి తిరిగి వచ్చినట్లు సమాచారం. గ్రేసీకర్ గతంలోనూ ఇదే విధం గా రెస్క్యూ హోం నుంచి వెళ్లినట్లు తెలిసింది. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్వేతాబసుప్రసాద్‌కి బాలీవుడ్ ఆఫర్!
మంచి చేసినప్పుడు వచ్చే ప్రచారం కన్నా చెడు చేసినప్పుడే వచ్చే ప్రచారం భారీ ఎత్తున ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణ శ్వేతాబసు ప్రసాద్. ఇప్పుడెక్కడ చూసినా ఆమె గురించే. ఇటీవల శ్వేత వ్యభిచారం కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. మూడు నెలల పాటు ఆమె రెస్క్యూ హోమ్‌లో ఉండాల్సిందిగా కోర్టు ఆదేశించింది. హఠాత్తుగా తన జీవితం ఇలాంటి మలుపు తీసుకుంటుందని శ్వేత ఊహించి ఉండరు. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబం కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని శ్వేత పేర్కొనడం గమనార్హం. ఆ సంగతలా ఉంచితే.. దాదాపు అందరూ ఆమెను వ్యతిరేకిస్తున్న సమయంలో బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఆమెకు అండగా నిలబడటం విశేషం. ‘‘శ్వేత ఫొటోలను ప్రచురించడం ఆపండి. ఆ రోజు ఆమెతో పాటు ఉన్న ఆ బడా క్లయింట్ల ఫొటోలను బయటపెట్టండి. అలాగే, ఆ వ్యవహారానికి వారధిగా ఉన్న ‘మధ్యవర్తి’ ఫొటోను బయటపెట్టండి’’ అని ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు హన్సల్ మెహతా. ‘మక్డీ’ చిత్రంలో బాలనటిగా శ్వేతా అభినయం తనకింకా గుర్తుందనీ, బాగా నటించిందని ఆయన పేర్కొన్నారు. అందుకే, తన తదుపరి చిత్రంలో ఆమెకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు కూడా హన్సల్ అన్నారు. జయతే, దిల్ పే మత్ లే యార్, ఉడ్‌స్టాక్ విల్లా తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత హన్సల్ది. గత ఏడాది‘షాహిద్’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి ప్రతిభా వంతుడు తనకు అండగా నిలవడం శ్వేతకు ఊరటగా ఉంటుందని ఊహించ వచ్చు. -
రెస్క్యూహోంలో శ్వేతా బసు ఏం చేస్తోంది?
ఒక్క సినిమా.. 'కొత్త బంగారు లోకం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. వ్యభిచారం కేసులో పట్టుబడిన ఆమె మూడు నెలల పాటు రెస్క్యూ హోంలోనే గడపాల్సి ఉంటుంది. గతంలో కొంతమందిని ఇలాగే రెస్క్యూ హోంకు పోలీసులు తరలించినా.. కొన్నాళ్లు అక్కడ ఉండి అక్కడినుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే శ్వేతా బసు మాత్రం అలా కాకుండా.. ఏమాత్రం దిగులు పడకుండా బాగానే ఉందని సమాచారం. సాధారణంగా అక్కడకు వెళ్లినవాళ్లు.. అందులోనూ కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్లయితే విపరీతమైన డిప్రెషన్లో పడిపోతారు. కానీ శ్వేతా బసు మాత్రం అలా లేదట. గత ఆదివారం నాడు పట్టుబడిన ఆమెను సోమవారం పోలీసులు ఎర్రమంజిల్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించడంతో అక్కడికి తరలించారు. రెస్క్యూ హోంలో ఉన్న శ్వేతా బసు.. ఎంచక్కా తన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి విషయాలు తెలుసుకుంటూ మామూలుగానే ఉందని తెలుస్తోంది. అక్కడ ఉన్నవాళ్లను కూడా పలకరిస్తూ.. వాళ్ల విశేషాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం.