రిక్టర్‌ స్కేల్‌ పగిలిపోద్ది! | gopichand new movie Trailer | Sakshi
Sakshi News home page

రిక్టర్‌ స్కేల్‌ పగిలిపోద్ది!

May 6 2017 12:04 AM | Updated on Sep 5 2017 10:28 AM

రిక్టర్‌ స్కేల్‌ పగిలిపోద్ది!

రిక్టర్‌ స్కేల్‌ పగిలిపోద్ది!

అప్పులిచ్చే నాన్నంటే బుల్లెట్‌ లాంటి కుర్రాడికి ప్రాణం. అయితే మెచ్చిన అమ్మాయికి మనసులో మాట చెప్పాలనుకునేలోపే ఆ అమ్మాయి

అప్పులిచ్చే నాన్నంటే  బుల్లెట్‌ లాంటి కుర్రాడికి ప్రాణం. అయితే మెచ్చిన అమ్మాయికి మనసులో మాట చెప్పాలనుకునేలోపే ఆ అమ్మాయి ఛీ కొడుతుంది. సడన్‌గా ఈ కుర్రాడి నాన్న ఓ అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటాడు. మనోడికి పూనకం వస్తుంది. రిక్టర్‌ స్కేల్‌ పగిలిపోయే రేంజ్‌లో విలన్‌కి వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతకీ ఈ అల్లరి అబ్బాయి వాళ్ల నాన్నను ఎలా కాపాడుకున్నాడు? అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘ఆరడుగుల బుల్లెట్‌’ చూడాల్సిందే.

బి.గోపాల్‌ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార జంటగా జయా బాలాజీ మీడియా పతాకంపై తాండ్ర రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘నరసింహనాయుడు, ఇంద్ర వంటి చిత్రాలను అందించిన బి.గోపాల్‌ తెరకెక్కించిన మరో ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆరడుగుల బుల్లెట్‌’. గోపీచంద్‌ అద్భుతంగా నటించారు. నయనతార గ్లామర్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణ. వంశీ అందించిన కథ సూపర్‌గా ఉంది. మణిశర్మ మంచి సంగీతం అందించారు’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement