ఘాజీ డైరెక్టర్తో మెగా హీరో సైన్స్ ఫిక్షన్..! | Ghazi Director Sankalp Reddy next Movie with Varun Tej | Sakshi
Sakshi News home page

ఘాజీ డైరెక్టర్తో మెగా హీరో సైన్స్ ఫిక్షన్..!

May 17 2017 2:15 PM | Updated on Sep 5 2017 11:22 AM

ఘాజీ డైరెక్టర్తో మెగా హీరో సైన్స్ ఫిక్షన్..!

ఘాజీ డైరెక్టర్తో మెగా హీరో సైన్స్ ఫిక్షన్..!

తొలి సినిమాతోనే ఘన విజయం సాధించటంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

తొలి సినిమాతోనే ఘన విజయం సాధించటంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. ఇంతటి విజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

తాజాగా సమాచారం ప్రకారం సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి,  తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

ఇటీవల మిస్టర్ సినిమాతో నిరాశపరిచిన వరుణ్ ప్రస్తతుం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఇవి పూర్తయిన తరువాత సంకల్ప రెడ్డి తెరకెక్కించే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement