జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం

Ghaji Movie Won Best National Telugu Film - Sakshi

జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే అవార్డులను ఈ రోజు(శుక్రవారం) ప్రకటించారు. 65వ జాతీయ చలన చిత్రం అవార్డుల్లో... శ్రీదేవి నటించిన మామ్‌ సినిమాతో పాటు టాలీవుడ్ విజువల్‌ వండర్‌ బాహుబలి2 సినిమాలకు అవార్డుల పంట పండింది. ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి 2 కు మూడు అవార్డులు లభించాయి. రానా నటించిన ఘాజీ చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో మొదటిసారిగా సబ్‌ మెరైన్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనే కాక ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో ఎంపికైంది.

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ : వినోద్‌ ఖన్నా

ఉత్తమ చిత్రం : విలేజ్‌ రాక్‌స్టార్స్‌ (అస్సామీ)

హిందీ ఉత్తమ చిత్రం : న్యూటన్‌

జాతీయ ఉత్తమ నటి : శ్రీదేవీ (మామ్‌)

జాతీయ ఉత్తమ నటుడు : రిద్ది సేన్ (మామ్)

ఉత్తమ దర్శకుడు : జయరాజ్‌ (భయానకమ్‌)

ఉత్తమ పోరాట సన్నివేశ చిత్రం : బాహుబలి2

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు : బాహుబలి2

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బాహుబలి2

ఉత్తమ నృత్య దర్శకుడు : గణేష్‌ ఆచార్య (టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ)

ఉత్తమ సంగీత దర్శకుడు : ఎఆర్ రెహ్మాన్ (కాట్రు వెలియదై)

ఉత్తమ నేపథ్య సంగీతం : ఎఆర్ రెహ్మాన్( మామ్‌)

ఉత్తమ గాయకుడు : జేసుదాసు

ఉత్తమ గాయని : షా షా తిరుపతి (కాట్రు వెలియదైలోని వాన్‌ వరువన్‌ )

ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్‌

ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ

ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క

ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి

ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)

ఉత్తమ సహాయ నటి : దివ్య దత్‌ (ఇరాదా)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top