ఫుల్‌ పాజిటివ్‌ | Geetha Arts acquires distribution rights for Paper Boy | Sakshi
Sakshi News home page

ఫుల్‌ పాజిటివ్‌

Aug 27 2018 5:31 AM | Updated on Aug 27 2018 5:31 AM

Geetha Arts acquires distribution rights for Paper Boy - Sakshi

సంపత్‌నంది, అల్లు అరవింద్, సంతోష్‌ శోభన్, సౌందర్‌రాజన్, నరసింహులు

సంతోష్‌ శోభన్, రియా సుమన్‌ జంటగా జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. సంపత్‌ నంది కథను అందిస్తూ, రాములు, వెంకట్, నరసింహులతో కలిసి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ సొంతం చేసుకుంది. అల్లు అరవింద్, ‘బన్నీ’ వాసు, దర్శకుడు మెహర్‌ రమేశ్‌లకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు చిత్రబృందం. ‘‘సినిమా నచ్చిన వెంటనే అల్లు అరవింద్‌గారు రిలీజ్‌ రైట్స్‌ను ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకు మంచి పాజిటివ్‌ వైబ్‌ ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్‌ రాజన్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement