కుటుంబం కోసం పోరాడే హీరో | From a mischievous kid to a promising action hero | Sakshi
Sakshi News home page

కుటుంబం కోసం పోరాడే హీరో

Jun 14 2014 12:38 AM | Updated on Apr 3 2019 8:57 PM

కుటుంబం కోసం పోరాడే హీరో - Sakshi

కుటుంబం కోసం పోరాడే హీరో

ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడూ ఉంటాయి.

‘‘ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడూ ఉంటాయి. ఈ సినిమాలో రాంబాబు అనే వ్యక్తి కుటుంబంలో ఆ రెండూ చోటుచేసుకుంటాయి. చెడుతో తను ఎలా పోరాటం చేశాడు? అనేదే ‘దృశ్యం’ సినిమా’’ అని నటుడు వెంకటేశ్ అన్నారు. ఆయన హీరోగా మలయాళ ‘దృశ్యం’ని అదే పేరుతో డి. సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనా కథానాయిక. పోలీసు అధికారిగా ఓ కీలక పాత్రను నిన్నటి తరం నాయిక, నదియా చేస్తున్నారు. కాగా, ఫాదర్స్ డేని పురస్కరించుకుని ఈ చిత్రబృందం ఓ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.

‘మై డాడ్ మై హీరో’ అనే కాన్సెప్ట్‌కు... ఎవరికి వారు తమ తండ్రితో స్మార్‌ఫోన్లలో స్వీయ చిత్రా (సెల్ఫీ)లు తీసుకుని, తమ జీవితంలో తండ్రి ప్రాధాన్యం, ఆయనతో అనుబంధం గురించి కథనం రాసి, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలి. ఉత్తమ కథనానికి ‘దృశ్యం’ బృందం బహుమతి అందిస్తారు. దీని కోసం ‘దృశ్యం’ పేరుతో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఖాతా ప్రారంభించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందని రామానాయడు అన్నారు. ‘‘ఇందులో వెంకటేశ్ పోషిస్తున్న రాంబాబు పాత్రకు భార్యగా నటిస్తున్నా.

నా పాత్ర పేరు జ్యోతి. ఒక మంచి భర్తకు భార్యగా కనిపిస్తాను’’ అని మీనా చెప్పారు. శ్రీప్రియ మాట్లాడుతూ, ‘‘వెంకటేశ్ సినిమాల్లోనే కాదు.. విడిగా కూడా మంచివాడే. ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనను చెడ్డవాడిగా ఎవరూ చూపించలేరు. ఒకవేళ చూపించినా ప్రేక్షకులు స్వీకరించరు’’ అని చెప్పారు. రాజ్‌కుమార్ సేతుపతి మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా గురించి ఆలోచించినప్పుడు మేం చెన్నైలో ఉన్నాం.

ఇందులో హీరోగా ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించినప్పుడు అందరూ ఏకగ్రీవంగా వెంకటేశ్ పేరు చెప్పారు. కమల్‌హాసన్ కూడా వెంకటేశ్ పేరే చెప్పారు. సురేష్‌బాబు మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాకి  చాలా పేర్లు అనుకున్నాం. చివరికి మాతృక టైటిల్ అయిన ‘దృశ్యం’ అయితేనే బాగుంటుందని, దాన్నే ఖరారు చేశాం. ఇది థ్రిల్లర్ అంశాలున్న కుటుంబ కథ’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement