breaking news
Each family
-
'ఇంటికో ఉద్యోగం పక్కా.. పవర్ ఇవ్వండి'
అసోం: అసోంలో తిరిగి తమకు అధికారం కట్టబెడితే ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. త్వరలో అసోంలో ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ గురువారం రాత్రి పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 'మేం మరోసారి అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కలిపి మొత్తం పది లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే మా అసలైన లక్ష్యం' అని బహుగుణ అన్నారు. దీంతోపాటు రూ.2.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారందరినీ ప్రత్యేక కుటుంబాలుగా గుర్తించి వారికి ప్రభుత్వ లబ్ధీలు అందేలా చేస్తామని చెప్పారు. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఐదేళ్లలో మరో రెండు లక్షల ఉపాధ్యాయ కొలువులు సృష్టిస్తామని తెలిపారు. చిన్నసన్నకారు తేయాకు రైతులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు. ప్రతి పర్వత ప్రాంతాల్లోని జిల్లాకు వెయ్యి కోట్లు ఇస్తామని తెలిపారు. -
ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు అకౌంట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం పథకాల లబ్ధిదారులంతా కుటుంబానికి కనీసం రెండు బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండేటట్లు చూడాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సోమవారం ప్రత్యక్ష లబ్ధిదారు మార్పిడి పథకం, ప్రధాన మంత్రి జనదానయోజన స్కీంలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులతో సహా అన్ని కుటుంబాలు రాష్ట్రంలో ఇప్పటికే 95 శాతం వరకు ఆధార్ సీడింగ్ కలిగి ఉన్నారనిమొత్తం 6,81,330 కుటుంబాల్లో ఇప్పటికే 4,84,939 కుటుంబాలు బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం రామకృష్ణారావు, డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి పాల్గొన్నారు. -
'కుటుంబానికి లక్షన్నర రుణమాఫీ'
-
కుటుంబం కోసం పోరాడే హీరో
‘‘ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడూ ఉంటాయి. ఈ సినిమాలో రాంబాబు అనే వ్యక్తి కుటుంబంలో ఆ రెండూ చోటుచేసుకుంటాయి. చెడుతో తను ఎలా పోరాటం చేశాడు? అనేదే ‘దృశ్యం’ సినిమా’’ అని నటుడు వెంకటేశ్ అన్నారు. ఆయన హీరోగా మలయాళ ‘దృశ్యం’ని అదే పేరుతో డి. సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనా కథానాయిక. పోలీసు అధికారిగా ఓ కీలక పాత్రను నిన్నటి తరం నాయిక, నదియా చేస్తున్నారు. కాగా, ఫాదర్స్ డేని పురస్కరించుకుని ఈ చిత్రబృందం ఓ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ‘మై డాడ్ మై హీరో’ అనే కాన్సెప్ట్‌కు... ఎవరికి వారు తమ తండ్రితో స్మార్ఫోన్లలో స్వీయ చిత్రా (సెల్ఫీ)లు తీసుకుని, తమ జీవితంలో తండ్రి ప్రాధాన్యం, ఆయనతో అనుబంధం గురించి కథనం రాసి, ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేయాలి. ఉత్తమ కథనానికి ‘దృశ్యం’ బృందం బహుమతి అందిస్తారు. దీని కోసం ‘దృశ్యం’ పేరుతో ఫేస్బుక్, ట్విట్టర్లో ఖాతా ప్రారంభించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందని రామానాయడు అన్నారు. ‘‘ఇందులో వెంకటేశ్ పోషిస్తున్న రాంబాబు పాత్రకు భార్యగా నటిస్తున్నా. నా పాత్ర పేరు జ్యోతి. ఒక మంచి భర్తకు భార్యగా కనిపిస్తాను’’ అని మీనా చెప్పారు. శ్రీప్రియ మాట్లాడుతూ, ‘‘వెంకటేశ్ సినిమాల్లోనే కాదు.. విడిగా కూడా మంచివాడే. ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనను చెడ్డవాడిగా ఎవరూ చూపించలేరు. ఒకవేళ చూపించినా ప్రేక్షకులు స్వీకరించరు’’ అని చెప్పారు. రాజ్‌కుమార్ సేతుపతి మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా గురించి ఆలోచించినప్పుడు మేం చెన్నైలో ఉన్నాం. ఇందులో హీరోగా ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించినప్పుడు అందరూ ఏకగ్రీవంగా వెంకటేశ్ పేరు చెప్పారు. కమల్‌హాసన్ కూడా వెంకటేశ్ పేరే చెప్పారు. సురేష్‌బాబు మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాకి చాలా పేర్లు అనుకున్నాం. చివరికి మాతృక టైటిల్ అయిన ‘దృశ్యం’ అయితేనే బాగుంటుందని, దాన్నే ఖరారు చేశాం. ఇది థ్రిల్లర్ అంశాలున్న కుటుంబ కథ’’ అని చెప్పారు.