నిర్మాతను మోసం చేసిన సునీల్ శెట్టి? | FIR against Suniel Shetty | Sakshi
Sakshi News home page

నిర్మాతను మోసం చేసిన సునీల్ శెట్టి?

May 2 2014 10:15 AM | Updated on Apr 3 2019 6:23 PM

నిర్మాతను మోసం చేసిన సునీల్ శెట్టి? - Sakshi

నిర్మాతను మోసం చేసిన సునీల్ శెట్టి?

సినిమా నిర్మాత ఒకరిని మోసం చేసిన కేసులో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిపై పోలీసు కేసు నమోదైంది.

సినిమా నిర్మాత ఒకరిని మోసం చేసిన కేసులో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిపై పోలీసు కేసు నమోదైంది. గత సంవత్సరం జూన్ నెలలో తాను సునీల్శెట్టితో ఒప్పందం కుదుర్చుకున్నానని, 'ముంబై కిస్కీ' అనే చిత్రంలో నటించేందుకు ఆయన 70 లక్షల రూపాయలు అడిగాడని హేమేంద్ర సింగ్ అనే నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తనవద్ద నుంచి ముందుగానే అడ్వాన్సుగా 21 లక్షలు తీసుకున్నాడని, కానీ, ఆ తర్వాత తాను మాట్లాడదామంటే అస్సలు దొరకలేదని, అలాగే అడ్వాన్సు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరకు తన సినిమాలో నటించేది లేదని కూడా చెప్పేశాడన్నాడు. దీంతో ఐపీసీ సెక్షన్లు 420 (మోసం), 406 (విశ్వాసఘాతుకం) కింద సునీల్ శెట్టిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను బ్యాంకు నుంచి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement