సినీ నటిపై లైంగిక వేధింపుల కేసులో దర్శకుడు అరెస్ట్ | Film director Subhash Kapoor held in actress molestation case | Sakshi
Sakshi News home page

సినీ నటిపై లైంగిక వేధింపుల కేసులో దర్శకుడు అరెస్ట్

Jun 23 2014 10:39 PM | Updated on Apr 3 2019 6:23 PM

సినీ నటిపై లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్‌ను సోమవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై: సినీ నటిపై లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్‌ను సోమవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సుభాష్ అతని సహచరుడు ధనీష్ రాజా 2012 మేలో ముంబై శివారు వెర్సొవాలోని తన నివాసానికి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంటూ సినీ నటి గీతికా త్యాగి గత ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు సుభాష్ ప్రయత్నించాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం సుభాష్ కపూర్‌ను అరెస్ట్ చేసి అంధేరి కోర్టులో హాజరుపరిచినట్టు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సమాధాన్ ధనేదర్ వెల్లడించారు.

 

కాగా, ధనేష్ రాజా పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు. సుభాష్ కపూర్ జాలీ ఎల్‌ఎల్‌బీ సినిమాకు దర్శకత్వం వహించగా.. త్యాగి ఆత్మ, వాట్ ద ఫిష్, వన్ బై టు వంటి సినిమాల్లో నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement