మరణంపై ఇర్ఫాన్‌ ఖాన్‌‌ భావోద్వేగ మాటలు! | Fans Shares Irrfan Khan Heart Breaking Words In His Life Of Pai Movie | Sakshi
Sakshi News home page

‘బాధకరం ఎంటంటే అది ఒక్క క్షణం కూడా తీసుకోదు’

Apr 29 2020 4:58 PM | Updated on Apr 29 2020 5:23 PM

Fans Shares Irrfan Khan Heart Breaking Words In His Life Of Pai Movie - Sakshi

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడి బుధవారం కన్నుముశారు. కాగా ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఆయన అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘లైప్‌ ఆఫ్‌ పై’లో పుట్టుక, మరణాలపై మాట్లాడిన  సన్నివేశాన్ని ట్వీట్‌ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.(ఇర్ఫాన్‌ ఖాన్ కన్నుమూత)


‘మరణం మన జీవితాన్ని ముగిస్తుందని నేను ఏప్పడు అనుకుంటాను. అయితే బాధకరమైన విషయం ఎంటంటే కనీసం వీడ్కోలు చేప్పెటప్పుడు అది ఒక్క క్షణం కూడా తీసుకోదు’ అని చెప్పిన సన్నివేశానికి ‘‘మీమ్మల్ని మిస్‌ అవుతున్నాము సార్‌.. వీ లవ్‌ యూ’’ అనే క్యాప్షన్‌తో ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. ‘‘ఆయన సినిమాలో చెప్పిన ఈ మాటలు దురదృష్టవశాత్తు ఈ రోజు సరిగ్గా సరిపోతాయి’’ ‘‘ఇన్ని రోజులు పోరాటం చేశారు.. ఇప్పుడు ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉందని ఆశిస్తున్నాం’’ అంటూ నెటిజన్లు భావోద్యేగంతో కామెంట్లు పెడుతున్నారు. కాగా హాలీవుడ్‌ డైరెక్టర్‌ అంగ్‌ లీ తెరకెక్కించిన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ లో ఇర్ఫాన్‌తో పాటు హీరోయిన్‌ టబు, సూరజ్‌ శర్మ నటించారు. ఈ చిత్రం నాలుగు ఆస్కార్‌ ఆవార్డులను అందుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 మిలియన్‌ డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది. (ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం)

Advertisement
 
Advertisement
Advertisement