చెడు ఎంచుకుంటే శిక్ష తప్పదు

enthavaralaina released on may 17 - Sakshi

అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్‌ జైన్, సీతారెడ్డి ముఖ్య పాత్రల్లో గురు చిందేపల్లి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎంతవారలైనా’. సంహిత, చిన్ని–చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై జి.సీతారెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత జి.సీతారెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాణరంగంలో ఉన్న నేను నిర్మాతగా మారడానికి ప్రధాన కారణం నా క్లాస్‌మేట్, దర్శకుడు గురు చిందేపల్లి. ఆ తర్వాత సినిమాలపై నాకున్న ప్యాషన్‌. సృష్టి ప్రారంభం నుంచి మంచీ, చెడు అనే రెండు మార్గాలున్నాయి. ప్రస్తుత కాలంలో ధనం కోసం దాడులు, హత్యలు జరుగుతున్నాయి.

అయితే చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఎంతవారలైనా శిక్షార్హులే అనే ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో ఎస్పీ పాత్ర చేశాను. ఉమేష్‌ చంద్ర, సురేంద్రలాంటి పోలీస్‌ ఆఫీసర్స్, నా అభిమాన నటుడు ఎస్వీ రంగారావుగారి స్ఫూర్తితో ఈ పాత్ర చేశా. నా పాత్రని రాజశేఖర్, సాయికుమార్‌గార్లతో పోల్చడం ఆనందంగా ఉంది. ఎస్వీ రంగారావు, కమల్‌హాసన్‌గార్లు అభిమానిస్తాను. నిర్మాతగా రామానాయుడుగారు, బిజినెస్‌పరంగా ‘దిల్‌’ రాజుగారు నాకు స్ఫూర్తి. తెలుగులో ఈ సినిమా విడుదలవుతోంది. కన్నడలో కూడా త్వరలోనే ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top