అనుబంధాలు.. వెటకారాలు

Director Ravikiran speech about Raja Varu Rani Garu - Sakshi

‘‘నాది తూర్పుగోదావరి జిల్లా భద్రవరం. నేను ఎవరి దగ్గరా దర్శకత్వశాఖలో చేయలేదు. ఇంటర్నెట్‌ నుంచి సమాచారం సేకరిస్తూ, షార్ట్‌ ఫిల్మ్స్‌ చూస్తూ సినిమాని తెరకెక్కించడం ఎలాగో నేర్చుకున్నా’’ అని డైరెక్టర్‌ రవికిరణ్‌ అన్నారు. కిరణ్‌ అబ్బవరమ్, రహస్యగోరక్‌ హీరోహీరోయిన్లుగా డి. మనోవికాస్‌ నిర్మించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా నవంబర్‌ 29న విడుదలైంది.

ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రవికిరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఊరి నుంచి హైదరాబాద్‌ వచ్చాక సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కథ కంటే కథనం బాగుండాలి. చిన్న అంశాల చుట్టూ సన్నివేశాలు అల్లుకుని ప్రేక్షకులను మెప్పించడం నాకు ఇష్టం. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అక్కడి అనుబంధాలు, రాజకీయాలు, వెటకారాలు తెలుసు. అందుకే ఈ నేపథ్యంలో కథ అల్లుకున్నా. మా సినిమా చూసినవారిలో కొందరు ‘తొలిప్రేమ’ చిత్రంలా ఉందనడం ఆనందంగా ఉంది. నా తర్వాతి చిత్రం కోసం రాజకీయ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసుకుంటున్నా’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top