విడాకులు తీసుకోనున్న డైరెక్టర్‌ క్రిష్‌..!

Is Director Krish Going To Take Divorce - Sakshi

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌ అలియాస్‌ జాగర్లముడి రాధాకృష్ణ తన వివాహ బంధానికి గుడ్‌ బై చెప్పనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న క్రిష్‌  కొద్ది కాలంలోనే విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. 2016 ఆగస్టులో వెలగ రమ్య అనే వైద్యురాలిని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే క్రిష్‌, రమ్యలు పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. క్రిష్‌ దంపతులు విడాకులకు దరఖాస్తు చేయడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.  అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  క్రిష్‌ నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్‌ మణికర్ణిక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ను కూడా క్రిష్‌ తెరకెక్కించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top