హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

Dimple Kapadia to star in Christopher Nolan's next titled Tenet - Sakshi

హాలీవుడ్‌ సినిమాల్లో మన ఇండియన్‌ తారలు అప్పుడప్పుడు మెరుస్తూనేఉన్నారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌ ఇలా హాలీవుడ్‌ సినిమాల్లో కనిపిస్తూనే వచ్చారు. ప్రియాంక అయితే ఏకంగా హాలీవుడ్‌కే మకాం మార్చేశారు. తాజాగా సీనియర్‌ నటి డింపుల్‌ కపాడియా ఓ హాలీవుడ్‌ సినిమాలో నటించడానికి అంగీకరించారు. హాలీవుడ్‌ క్రేజీ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో డింపుల్‌ నటించనున్నారు.

ఇంగ్లీష్‌ సినిమాలో నటించడం ఆమెకు ఇది మొదటిసారేం కాదు, ‘లీలా’ (2002) అనే ఆంగ్ల చిత్రంలో ఆల్రెడీ నటించారామె. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కే తాజా చిత్రంలో ఆస్కార్‌ విజేత డేవిడ్‌ వాషింగ్టన్‌ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘టెనిట్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. సుమారు ఏడు దేశాల్లో ఈ సినిమాను షూట్‌ చేయనున్నారట. వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్‌ కానున్న ఈ చిత్రాన్ని వార్నర్‌ బ్రదర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top