విదేశాల్లో బాలీవుడ్ సినిమాల శక్తిని గుర్తించాం! | Diaspora is a huge market for Bollywood, Boman Irani | Sakshi
Sakshi News home page

విదేశాల్లో బాలీవుడ్ సినిమాల శక్తిని గుర్తించాం!

Sep 21 2014 7:31 PM | Updated on Apr 3 2019 6:23 PM

విదేశాల్లో బాలీవుడ్ సినిమాల శక్తిని గుర్తించాం! - Sakshi

విదేశాల్లో బాలీవుడ్ సినిమాల శక్తిని గుర్తించాం!

బాలీవుడ్ సినిమాలకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉంటోందని విలక్షణ నటుడు బొమన్ ఇరానీ వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: విదేశాల్లో బాలీవుడ్ సినిమాల శక్తిని గుర్తించామని విలక్షణ నటుడు బొమన్ ఇరానీ తెలిపారు. బాలీవుడ్ సినిమాలకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతవరకూ భారత్ మార్కెట్‌నే నమ్ముకుని సినిమాలు తీస్తున్నామని, ఇటీవలే ప్రవాస భారతంలో కూడా బాలీవుడ్ సినిమాలకు మంచి గిరాకీ ఉందనే విషయాన్ని పరిశ్రమ గుర్తించిందని ఆయన అన్నారు. అమెరికాలో చైనీయులు తరువాత భారతీయుల సంఖ్య సుమారు 28 లక్షలకు పైగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగకు విడుదల కానున్న తమ సినిమాకు అక్కడ ప్రచారం కల్పించేందుకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ టీం ఆ దేశంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం హోస్టన్‌లోని టొయోటా సెంటర్‌లో కార్యక్రమాన్ని ఆరంభిందన్నాడు.
 

ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరో షారూఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణే తో పాటు ఇతర ప్రధాన పాత్రధారులైన అభిషేక్ బచ్చన్, సోనూసూద్, వివాన్‌షా స్టేజ్ షోల్లో అలరించడానికి సిద్ధమవుతున్నారని ఇరానీ స్పష్టం చేశాడు. త్వరలోనే విడుదల కానున్న షారూఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో ఇరానీ కనిపించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement