ధనుష్‌కు జంటగా విద్యాబాలన్ | Dhanush movie with Vidya Balan | Sakshi
Sakshi News home page

ధనుష్‌కు జంటగా విద్యాబాలన్

Aug 26 2015 4:54 AM | Updated on Sep 3 2017 8:07 AM

ధనుష్‌కు జంటగా విద్యాబాలన్

ధనుష్‌కు జంటగా విద్యాబాలన్

యువనటుడు ధనుష్ బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్‌తో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారా...

యువనటుడు ధనుష్ బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్‌తో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. వేల ఇల్లా పట్టాదారి, మారి చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న ధనుష్ ప్రస్తుతం వీఐపీ 2 చిత్రాన్ని పూర్తి చేసి ప్రభుసాలమన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. కాగా తదుపరి చిత్రానికి కూడ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనికి ఎదుర్‌నీశ్చల్, కాక్కిసట్టై చిత్రాల దర్శకుడు దురై సెంధింల్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు.

నేటి రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో కూడిన ఈ చిత్రంలో ప్రస్తుతం సమాజంలోని ఒక బర్నింగ్ ప్రాబ్లమ్‌ను చర్చించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఇందులో ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. అన్నదమ్ములుగా నటించనున్న ఈ చిత్రంలో అన్న పాత్రకు బాలీవుడ్ నటిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో భాగంగా కహానీ భామ విద్యాబాలన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. విద్యాబాలన్ ఇంతకు ముందు మణిరత్నం తెరకెక్కించిన గురు చిత్రంలో మెరిశారు. ఆ తరువాత కోలీవుడ్ తెరపై కనిపించలేదు. తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement