రజనీకాంత్‌పై బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Vidya Balan Interesting Comments On Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌పై బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Oct 14 2026 12:22 PM | Updated on Oct 14 2026 12:24 PM

Vidya Balan Interesting Comments On Rajinikanth

ఎంత స్టార్‌డమ్‌ సంపాదించినా ఒదిగి ఉండటం కొందరికే సాధ్యమవుతుంది. అందుకే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తెరపై తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరించే ఆయన.. నిజ జీవితంలో మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉంటారని బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ అన్నారు. రజనీకాంత్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్‌ 2’లో విద్యాబాలన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో సూపర్‌స్టార్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను ఆమె పంచుకున్నారు. రజనీకాంత్‌ వ్యక్తిత్వం నుంచి ప్రతి ఒక్కరూ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని, ఆయనలో ఎలాంటి ఆర్భాటం కనిపించదని ప్రశంసించారు.

(చదవండి: అమ్మాయి పుడితే.. రష్మిక వ్యాఖ్యలు వైరల్‌)

‘రజనీకాంత్‌ నుంచి నేర్చుకోవడానికి, మన జీవితంలో అలవర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అంతటి స్టార్‌డమ్‌ ఉన్నప్పటికీ ఆయన చాలా సాధారణంగా ఉంటారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇవ్వరు. ప్రేక్షకులు ఆయన్ని ఇంతగా ప్రేమించడానికి అదొక ముఖ్యమైన కారణం. అలాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని విద్యాబాలన్‌ పేర్కొన్నారు.

రజనీకాంత్‌తో పనిచేసే సమయంలో తనకు ఎలాంటి ఒత్తిడి కలగలేదని ఆమె చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఆందోళనకు గురైనా, ఆయన తన మాటలతో ఆ పరిస్థితిని సులభంగా మార్చేస్తారని తెలిపారు. సెట్‌లో ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, వారిని అభినందిస్తూ ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత అని విద్యాబాలన్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement