బయోపిక్‌ కాదు! | Vidya Balan announced her upcoming Tamil film with R Balki | Sakshi
Sakshi News home page

బయోపిక్‌ కాదు!

Oct 9 2026 4:39 AM | Updated on Oct 9 2026 4:39 AM

Vidya Balan announced her upcoming Tamil film with R Balki

విద్యాబాలన్‌ ప్రధాన పాత్రధారిగా ఆర్‌. బాల్కీ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. అయితే ఈ సినిమా ఓ ప్రముఖ గాయని బయోపిక్‌ అని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ అంశంపై దర్శకుడు ఆర్‌. బాల్కీ స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్నట్లు ఇది బయోపిక్‌ సినిమా కాదు. నిజానికి మేం ఒక ఫన్‌ స్టోరీపై వర్క్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... అమితాబ్‌ బచ్చన్, అభిషేక్‌ బచ్చన్, విద్యాబాలన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించి, 2009లో విడుదలైన ‘పా’ సినిమాకు దర్శకత్వం వహించారు ఆర్‌. బాల్కీ. మళ్లీ ఇప్పుడు అంటే... దాదాపు 17 సంవత్సరాల తర్వాత విద్యా బాలన్, బాల్కీ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement