వైరలవుతోన్న వీడియో.. ఆడుకుంటున్న నెటిజనులు

Deepika Padukone Forgot She Is A Wife - Sakshi

బాలీవుడ్‌ పద్మావత్‌ దీపికా పదుకోన్‌ నెటిజనుల చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. ఇంత మతిమరుపు ఐతే ఎలా అమ్మ అంటూ నెటిజన్లు దీపికాను ఓ ఆట ఆడుకుంటున్నారు. డిప్రెషన్‌ పట్ల అవగాహన కల్పించడం కోసం దీపికా లీవ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి సోదరి అనిశా పదుకోన్‌తో కలిసి హాజరయ్యారు దీపికా పదుకోన్‌. ఈ వేదిక మీద మానసిక ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఈ సందర్భంగా గతంలో తాను కూడా డిప్రెషన్‌తో బాధపడినట్లు దీపికా వెల్లడించారు.

ఈ సదర్భంగా దీపికా మాట్లాడుతూ.. ‘నిజ జీవితంలో నేను ఎన్నో పాత్రలు పోషించాను. ఓ కుమార్తె, ఓ సోదరి, ఓ నటిగా అని మాట్లాడుతూ.. పదాల కోసం వెతుక్కుంటుండగా.. పక్కనే ఉన్న వారు ‘ఓ భార్యగా’ అని అందించారు. అప్పుడు దీపికా ఆ ఓ భార్యగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ‘నేను ఓ భార్యను కూడా కదా.. ఓరి దేవుడా ఆ విషయం నేను మర్చిపోయాను’ అంటూ దీపికా నవ్వుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. గత ఏడాది నవంబర్‌లో దీపికా-రణ్‌వీర్‌ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top