breaking news
Live Love Laugh
-
పెళ్లైన విషయం మర్చిపోయిన నటి
బాలీవుడ్ పద్మావత్ దీపికా పదుకోన్ నెటిజనుల చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. ఇంత మతిమరుపు ఐతే ఎలా అమ్మ అంటూ నెటిజన్లు దీపికాను ఓ ఆట ఆడుకుంటున్నారు. డిప్రెషన్ పట్ల అవగాహన కల్పించడం కోసం దీపికా లీవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి సోదరి అనిశా పదుకోన్‌తో కలిసి హాజరయ్యారు దీపికా పదుకోన్. ఈ వేదిక మీద మానసిక ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఈ సందర్భంగా గతంలో తాను కూడా డిప్రెషన్‌తో బాధపడినట్లు దీపికా వెల్లడించారు. ఈ సదర్భంగా దీపికా మాట్లాడుతూ.. ‘నిజ జీవితంలో నేను ఎన్నో పాత్రలు పోషించాను. ఓ కుమార్తె, ఓ సోదరి, ఓ నటిగా అని మాట్లాడుతూ.. పదాల కోసం వెతుక్కుంటుండగా.. పక్కనే ఉన్న వారు ‘ఓ భార్యగా’ అని అందించారు. అప్పుడు దీపికా ఆ ఓ భార్యగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ‘నేను ఓ భార్యను కూడా కదా.. ఓరి దేవుడా ఆ విషయం నేను మర్చిపోయాను’ అంటూ దీపికా నవ్వుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గత ఏడాది నవంబర్‌లో దీపికా-రణ్‌వీర్‌ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram Deepika : I am a daughter, I am a sister, I am an actor Host : a wife?? Deepika : ohh i forgot that 🤷🏻♂😂😂🤣. @ranveersingh you should must see this 😅😂😂😂 • • • @deepikapadukone #deepikapadukone #ranveersingh #lecture #livelovelaugh #gorgeous #flawlessbeauty #beyondbeauty #beautyqueen #queenofhearts #queenofbollywood #beautiful #bollywood #hollywood #actress #piku #bajiraomastani #mastani #bollywoodactress #hollywoodactress #bollywoodnews #gainlikes #gainfollowers A post shared by DEEPIKA PADUKONE THE PRINCESS (@deepika.padukone.princess) on Sep 15, 2019 at 11:07am PDT -
వేల సంఖ్యలో మెసేజ్‌లొస్తున్నాయి - దీపికా పదుకొనే
సినీ తారలు ఏం చేసినా పబ్లిసిటీ స్టంట్ అంటారు. పాపం... మంచి పని చేసినా, మంచి విషయం మాట్లాడినా ఇదంతా కేవలం డబ్బు కోసమే అని చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు . దీపిక క్కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బాలీవుడ్లో మిగతా కథానాయికలతో పోలిస్తే దీపిక సమ్‌థింగ్ స్పెషల్. తన మనసుకు నచ్చినట్టు మాట్లాడటం దీపికకు ఉన్న ప్రత్యేకత . అయితే దీపిక ఇంత ధైర్యంగా గతంలో ఉండేవారు కాదు. కొన్నాళ్లపాటు ఆమె తీవ్రాతితీవ్రంగా డిప్రెషన్‌తో కుంగిపోయారు. తర్వాత బయట పడ్డారనుకోండి. అయితే చాలా మంది అలాంటి విషయాలు మీడియా ముందు చెప్పరు. కానీ దీపిక చాలా ధైర్యంగా తన మానసిక పరిస్థితి గురించి చెప్పేశారు.అంతేకాకుండా తనలా డిప్రెషన్లో కుంగిపోయిన వారికి అండగా నిలబడటం కోసం ‘ లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను నెలకొల్పారు. ‘‘ కేవలం ఫార్మాస్యూటికల్ కంపెనీకి ప్రచారం కోసం ఈ సంస్థ నెలకొల్పారని, ఇదో పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది నన్ను మొదట్లో విమర్శించారు. కానీ ఈ సంస్థ గురించి వస్తున్న రెస్పాన్స్ మాత్రం సూపర్బ్. మీ వల్ల నా ప్రాణం నిలబడింద ని చెబుతూ ఓ అమ్మాయి నాకు సందేశం పంపింది. అదొక్కటి చాలు. ఇలాంటి మెసేజ్‌లు కొన్ని వేల సంఖ్యల్లో వస్తున్నాయి. నాలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ .అంతేగానీ డబ్బు సంపాదించాలన్న అత్యాశ మాత్రం కాదు’’ అని దీపిక స్పష్టం చేశారు.